AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు మొత్తం కుటుంబాన్ని తమ భుజాలపై మోస్తారు!

సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు, కష్ట సమయాల్లో ఎలా స్పందిస్తారు అనేది మీ జన్మ సంఖ్యను బట్టి మారుతుంటుంది. ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట తేదీలలో జన్మించిన అమ్మాయిలు పుట్టినప్పటి నుండే నాయకత్వ లక్షణాలను, బాధ్యతాయుతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు తమ వ్యక్తిగత ఇష్టాల కంటే కుటుంబ క్షేమానికే ప్రాధాన్యత ఇస్తూ, ఇంటి బాధ్యతలను ధైర్యంగా తమ భుజాలపై మోస్తారు. అపారమైన తెలివితేటలు, సహనం పట్టుదలతో కుటుంబాన్ని నడిపించే ఆ లక్కీ డేట్స్ ఏవో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

Numerology: ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు మొత్తం కుటుంబాన్ని తమ భుజాలపై మోస్తారు!
Numerology For Women's Personality
Bhavani
|

Updated on: Apr 27, 2026 | 6:55 PM

Share

ఏ నెలలోనైనా 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన అమ్మాయిలు సంఖ్య 1 కిందకు వస్తారు. వీరికి సూర్యుడు అధిపతి కావడం వల్ల సహజంగానే నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. వీరు చాలా బాధ్యతగా ఉంటారు ఏ పని చేసినా అది పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొదట వీరినే సంప్రదిస్తారు. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి నిర్ణయంలోనూ కుటుంబానికి మార్గదర్శిగా నిలుస్తారు.

తెలివితేటలు, మానసిక దృఢత్వం (సంఖ్య 5)

ఏ నెలలోనైనా 5, 14, 23వ తేదీలలో జన్మించిన వారు సంఖ్య 5 కిందకు వస్తారు. ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు అత్యంత తెలివైనవారు ఏ విషయాన్నైనా వేగంగా నేర్చుకోగలరు. వీరిలో మానసిక దృఢత్వం ఎక్కువగా ఉంటుంది. కష్ట సమయాల్లో అస్సలు కంగారు పడకుండా, ప్రశాంతంగా ఆలోచించి సరైన పరిష్కారాన్ని కనుగొంటారు. వీరి మేధస్సు కుటుంబానికి ఒక గొప్ప అండగా మారుతుంది.

ధైర్యం, పోరాట పటిమ (సంఖ్య 8)

ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీలలో జన్మించిన వారు సంఖ్య 8 కిందకు వస్తారు. శని గ్రహ ప్రభావం వల్ల వీరి జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి, కానీ వారు వేటికీ భయపడరు. ప్రతి సమస్యను ఒక పాఠంగా భావిస్తూ ధైర్యంగా ముందుకు సాగుతారు. తమ కుటుంబ సభ్యుల కోసం ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి, ఎంతటి త్యాగానికైనా వీరు సిద్ధంగా ఉంటారు. సమస్యలను పరిష్కరించడంలో వీరు మొనగాళ్లుగా పేరు తెచ్చుకుంటారు.

దయ, త్యాగనిరతి (సంఖ్య 9)

ఏ నెలలోనైనా 9, 18, 27వ తేదీలలో జన్మించిన వారు సంఖ్య 9 కిందకు వస్తారు. కుజుడు వీరికి అధిపతి కావడం వల్ల వీరు చాలా ధైర్యవంతులు దయగలవారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. కుటుంబ గౌరవం కోసం, క్షేమం కోసం తమ సొంత సుఖాలను సైతం వదులుకోవడానికి వెనుకాడరు. ఇంటి బాధ్యత మొత్తాన్ని తమ భుజాలపై వేసుకుని, కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు.

పుట్టిన తేదీని బట్టి వ్యక్తిత్వాలను అంచనా వేయడం సంఖ్యాశాస్త్రంలోని ఒక భాగం. అయితే, సంస్కారం పెరిగిన వాతావరణం కూడా ఒక వ్యక్తిని బాధ్యతాయుతమైన మనిషిగా తీర్చిదిద్దుతాయి.

గమనిక: ఈ సమాచారం సంఖ్యాశాస్త్రం ప్రాచుర్యంలో ఉన్న జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ప్రతి వ్యక్తిలోనూ విభిన్నమైన ప్రతిభ, బాధ్యత ఉంటాయి. కేవలం అంకెలను బట్టి కాకుండా వారి ప్రవర్తన, కృషిని బట్టి గౌరవించడం ముఖ్యం. జీవితంలో విజయం సాధించడానికి కష్టపడటం సానుకూల దృక్పథం కలిగి ఉండటం అందరికీ అవసరం.

Follow Us