AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Savings Tips: ఏసీ vs కూలర్.. ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే నెలకు రూ.2 వేలు ఆదా చేసుకోవచ్చు..

ఏసీ మంచిదా.. ? ఎయిర్ కూలర్ మంచిదా..? ఈ రెంటిలో ఏది బెస్ట్ అనే డౌట్ చాలామందికి ఉంటుంది. విద్యుత్‌ను ఆదా చేసుకోవాలంటే కూలర్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇంట్లో ఏసీ కాకుండా కూలర్ వాడుకుంటే నెలకు రూ.2 వేల వరకు ఆదా అవుతుంది.

Venkatrao Lella
|

Updated on: Apr 27, 2026 | 6:23 PM

Share
ప్రస్తుతం వేసవికాలం మొదలుకావడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భానుడి ఉగ్రరూపంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే మొదలవుతున్న ఎండ ప్రభావం.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎండ నుంచి తట్టుకునేందుకు ఇంట్లో ఏసీలు, ఎయిర్ కూలర్లు అనేవి ఎక్కువగా వినియోగిస్తున్నారు.

1 / 5
అయితే ఏసీ ఉంటే మంచిదా..? ఎయిర్ కూలర్ సరిపోతుందా? అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొ ప్రాంతంలో ఒక్కోలా వాతావరణం ఉంటుంది. దీంతో స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి ఏసీనా లేదా కూలర్ సరిపోతుందా? అనేది ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కూలర్ ఫ్యాన్, వాటర్ మోటార్‌తో పనిచేస్తుంది. అదే ఏసీ కంప్రెసర్, గ్యాస్, పూర్తి రిఫ్రిజిరేషన్ వ్యవస్థను ఉపయోగిస్తుంది.

2 / 5
కూలర్ 100 నుంచి 300 వాట్స్ వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఇక ఒక టన్ ఏసీ సుమారు 900 నుంచి 1200 వాట్లను, ఇక 1.5 టన్ ఏసీ 1400 నుంచి 1800 వాట్లను వినియోగిస్తుంది. దీంతో కూలర్ కంటే ఏసీ బిల్లు ఎక్కువగా వస్తుంది. కూలర్ ఒక రోజులో సుమారు 8 గంటల పాటు ఆన్ చేసి ఉంచితే దాదాపు 1 నుంచి 2 యూనిట్ల విద్యుత్‌ను వాడుతుంది. అంటే నెల మొత్తం 24 నుంచి 72 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది.

3 / 5
సగటు యూనిట్ విద్యుత్ ధర రూ.7 నుంచి రూ.8 వరకే ఉంటే.. నెలవారీ విద్యుత్ ఖర్చు రూ.500 నుంచి రూ.800 మధ్య ఉంటుంది. ఇక 1.5 టన్ల ఇన్వర్టర్ ఏసీ 8 గంటల పాటు నడిస్తే.. 5 స్టార్ ఏసీ రోజుకు 9 నుంచి 12 యూనిట్లు, 3 స్టార్ ఏసీ రోజుకు 9 నుంచి 12 యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఇక నాన్ ఇన్వర్టర్ రోజుకు 12 నుంచి 14 యూనిట్లు వినియోగిస్తుంది. అంటే నెలకు 200 నుంచి 350 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తే నెలకు రూ.2 వేల నుంచి రూ.3,500 వరకు విద్యుత్ ఖర్చు ఉంటుంది.

4 / 5
కూలర్ గాలిని చల్లబర్చడానికి నీటిని ఉపయోగిస్తుంది. పొడి వేడిలో ఇది బాగా పనిచేస్తుంది. ఏసీ గదిలోని వేడిని, తేమను రెండింటిని తొలగిస్తుంది. దీంతో తేమతో కూడిన వాతావరణంలో ఇది బాగా పనిచేస్తుంది. గాలిలో తేమ ఎక్కువ ఉంటే కూలర్ బలహీనపడి ఏసీ అవసరమవుతుంది. ప్రతి ప్రాంతంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. దీంతో అందరికీ ఏసీ అవసరం ఉండదు. కూలర్‌ ఉంటే సరిపోతుంది. అందుకే మీ ప్రాంతంలో వాతావరణాన్ని బట్టి ఏది మంచిది అనేది ఎంచుకోండి.

5 / 5
Follow Us
ఆ హీరోతో వర్క్ చేసినప్పుడు చాలా గిల్టీగా ఫీలయ్యా..

పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా

ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..

ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!

ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్

కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..

జుంకాల నుండి నెక్లెస్‌ల వరకు.. అత్యంత చౌకగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ

భారీ డ్రోన్ దాడి.. భారతీయ ఉద్యోగి మృతి!
భారీ డ్రోన్ దాడి.. భారతీయ ఉద్యోగి మృతి!
ఎన్ఎస్‌జీ హబ్‌లో షూటింగ్‌తో అదరగొట్టిన మహీ.. అసలు గాయమైందా?

వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా?మొక్కలకు అమృతం లాంటి ఎరువు తయారీ