AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పాములను దోమలు కరిస్తే విషం ఎక్కుతుందా..? ఈ వీడియో చూస్తే మీ మైండ్ బ్లాంక్..

ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి.. సాధారణంగా దోమలు మనుషులను, పక్షులను కుడతాయని మనకు తెలుసు. కానీ ఒక దోమ.. అత్యంత విషపూరితమైన పామును కుట్టి, ప్రశాంతంగా రక్తాన్ని తాగుతున్న అరుదైన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్లు బంధించిన ఈ అద్భుత దృశ్యం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? పాము రక్తం తాగితే దోమ చనిపోదా? అనేది తెలుసుకుందాం..

Video: పాములను దోమలు కరిస్తే విషం ఎక్కుతుందా..? ఈ వీడియో చూస్తే మీ మైండ్ బ్లాంక్..
Can A Mosquito Bite A Snake And Survive
Krishna S
|

Updated on: Apr 27, 2026 | 6:48 PM

Share

అడవి అంటేనే బలవంతుడిదే రాజ్యం. సింహం గర్జించినా, పాము బుసకొట్టినా సకల జీవులు వణికిపోవాల్సిందే. కానీ ప్రకృతిలో కొన్నిసార్లు ఊహించని దృశ్యాలు కనిపిస్తాయి. అత్యంత విషపూరితమైన పామును కూడా ఒక చిన్న కీటకం గడగడలాడించగలదా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అరుదైన ఫోటోలు. ఇటీవల ఒక వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ అడవిలో తీసిన ఒక ఫోటో నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మధ్య అమెరికాలోని కోస్టారికా అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన ఫెర్ డి లాన్స్ అనే విషసర్పం తలపై ఒక దోమలు వాలి, దర్జాగా రక్తాన్ని తాగుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. మన దేశంలోని తీగపాములపై కూడా ఇలాంటి దృశ్యాలు గతంలో వైరల్ అయ్యాయి.

పాము రక్తం దోమకు విషం కాదా..?

సాధారణంగా దోమలు మనుషులనో, పక్షులనో కుడతాయని మనకు తెలుసు. కానీ సరీసృపాలను కూడా ఇవి వదలవు. శాస్త్రవేత్తల ప్రకారం.. పాము రక్తంలో దోమలకు కావలసిన ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాము విషం దాని కోరల్లో, విషపు గ్రంథుల్లో ఉంటుంది కానీ రక్తంలో ఉండదు. అందుకే ఆ రక్తాన్ని తాగడం వల్ల దోమలకు ఎటువంటి ప్రాణహాని జరగదు. పాము చర్మంపై ఉండే చిన్నపాటి రంధ్రాల ద్వారా దోమ తన తొండాన్ని సులభంగా చొప్పించి రక్తాన్ని పీల్చగలదు.

పాము ఎందుకు ఎదురుదాడి చేయదు..?

ప్రపంచాన్నే వణికించే పాము తనను కుడుతున్న దోమను ఎందుకు చంపదు? దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.. పాములు చల్లని రక్త జంతువులు. అవి ఆహారం వేటాడటానికి తప్ప, అనవసరమైన చిన్న చిన్న కదలికల కోసం శక్తిని వృథా చేయవు. దోమ కాటు చాలా సున్నితంగా ఉంటుంది. పాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ చిన్న కాటును అది గమనించకపోవచ్చు.

శాస్త్రీయంగా ఎంతో ముఖ్యం

ఈ ఫోటోలు కేవలం వినోదం కోసమే కాదు, శాస్త్రీయ పరిశోధనలకు కూడా కీలకం. పాముల ద్వారా వెస్ట్ నైల్ వైరస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయా అన్న కోణంలో పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఫ్లోరిడా వంటి ప్రాంతాల్లో ప్రమాదకరమైన బర్మీస్ కొండచిలువలను కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ దోమలనే సూచికలుగా వాడుతుండటం విశేషం. ఏది ఏమైనా “కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది” అన్నట్లు.. ఈ ఫోటోలు చూస్తుంటే మాత్రం టైమ్ బాగుంటే దోమ కూడా పాము రక్తాన్ని తాగుతుంది అని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us