అందమైన, విలువైన రత్నంగా వజ్రాన్ని పరిగణిస్తారు. జోతిష్యశాస్త్రంలో వజ్రాన్ని శుక్రుడి రత్నంగా భావిస్తారు. అయితే ప్రతీ ఒక్కరూ వజ్రాన్ని ధరించకూడదు. శుక్రుడి స్థానాన్ని బలోపేతం చేయగల సామర్ధ్యం వజ్రానికి ఉంది. వజ్రం ధరించడం వల్ల కలిగే శుభ ఫలితాలతో ఓ వ్యక్తి ఆనందం, శ్రేయస్సు, సంపద పొందుతాడు. మరి వజ్రం ఏ రాశివారికి శుభాన్ని కలిగిస్తుందో.? ఏ రాశివారు వజ్రాన్ని పెట్టుకుంటే ఆశుభమో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం:
ఈ రాశివారికి శుక్రుడు అధిపతి. ఈ రాశిలో శుక్రుడు రెండు లేదా ఏడో పాదంలో ఉంటాడు. కాబట్టి ఈ రాశివారు వజ్రాన్ని ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి.
కర్కాటకం:
ఈ రాశిలో శుక్రుడు నాలుగు, 11వ పాదంలో అధిపతి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వజ్రాన్ని ధరించకూడదు. అయితే శుక్రమహాదశలో వజ్రాన్ని ధరించవచ్చు. మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రమహదశ లేనప్పుడు మాత్రం వజ్రం ధరించవచ్చా.? లేదా.? అనేదానిపై జోతిష్యుడిని సంప్రదించండి.
సింహం:
సింహరాశిలో శుక్రుడు మూడు, పదో పాదానికి అధిపతి. కాబట్టి ఈ రాశివారు వజ్రాన్ని ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే ఉద్యోగం, వ్యాపారంలో అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మీరు వజ్రం ధరించాలనుకుంటే జోతిష్యుడి సలహా తీసుకోండి.
వృశ్చికం:
ఈ రాశిలో అంగారకుడికి, శుక్రుడికి మధ్య గొప్ప శత్రుత్వం ఉంటుంది. అందుకే ఈ రాశిలో జన్మించినవారు వజ్రాన్ని ధరించడం వల్ల సమస్యల వలయంలో చిక్కుకుంటారు. మొదలుపెట్టిన పని ఏదీ కూడా సకాలంలో పూర్తి కాదు.
ధనుస్సు:
ఈ రాశి వ్యక్తులు వజ్రాన్ని ధరిస్తే, వారి జీవితంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీనం:
శుక్రుడు మీనరాశిలో మూడు, ఎనిమిది పదానికి అధిపతి. అందువల్ల ఈ రాశివారు వజ్రాన్ని ధరిస్తే అశుభ ఫలితాలను ఎదుర్కుంటారు. ఇదే కాకుండా మీనరాశి అధిపతి బృహస్పతి దేవతల గురువు, శుక్రుడు అసురల గురువు. ఈ రెండింటి మధ్య శత్రుత్వం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు వజ్రాన్ని ధరించకూడదు.
Also Read:
తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..
ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!
వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్‌ను మించిపోయాడు.. డెబ్యూ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ అర్ధ శతకం సాధించాడు..
షాపింగ్ చేస్తుండగా మహిళకు షాక్.. ఎదురుగా భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!