ప్రతి వ్యక్తికి లోటుపాట్లు ఉండటం సహజం. కొంతమంది స్వతహాగా తమకు తాము సృష్టించుకుంటే.. మరికొందరికి పుట్టుకతోనే లోపాలు ఉంటాయి. పుట్టుకతో వచ్చే లక్షణాలను జాతకం, గ్రహ నక్షత్రరాశుల ద్వారా అంచనా వేయోచ్చునని పండితులు చెబుతుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ నాలుగు రాశులవారు ప్రతీ విషయానికి వాదనకు దిగుతారని.. వారి అభిప్రాయమే కరెక్ట్ అని ఒప్పించేందుకు ఎంతకైనా సిద్దపదతారని తెలుస్తోంది. మరి ఆ నాలుగు రాశులు ఏంటో చూద్దాం పదండి.!
మేషం: మేషరాశివారు చాలా తెలివైనవారు. అంతేకాకుండా గర్వంతో ఉంటారు. వారు చేయాలనుకున్నదే చేస్తారు. వారు చెప్పినదే కరెక్ట్ అని భావిస్తారు. ఎవరైనా తమ పాయింట్‌కు అడ్డం వస్తే.. చాలా కోపగించుకోవడమే కాకుండా వాదనకు కూడా దిగుతారు.
సింహం: సింహరాశి వారు స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు. వారికి ఏదైనా నచ్చకపోతే.. వాగ్వాదానికి దిగుతారు. ఎదుటవారు చెప్పింది వినరు. ఎవరైనా వారిని ఒప్పించటానికి ప్రయత్నించినా, వారి అహం దెబ్బతిని.. తగాదాకు దిగుతారు. ఎవరూ కూడా వారితో గొడవలో గెలవడం కష్టమే.
తుల: తులరాశివారు నిశ్చల స్వభావం కలిగినవారు. వారు ఇతరుల గురించి బాగా ఆలోచిస్తారు. కానీ కోపం వచ్చినప్పుడు వారు.. ఎదుటవ్యక్తి తమ గురించి ఏం అనుకుంటారా.! అని పట్టించుకోరు. కోపం వచ్చిన సమయంలో ఎవరైనా వారితో ఏదైనా చెబితే, వారు వాదించడం మొదలుపెడతారు.
కుంభం: కుంభం రాశివారు తమ జీవితంలో చాలా కష్టపడతారు. అలాగే వారి చేసిన పోరాటానికి తగ్గట్టుగా పరువు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఈ క్రమంలోనే వారిలో కొంచెం ఆధిపత్య భావన కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఎవరైనా వారి మాటను వ్యతిరేకిస్తే, వారు చిరాకుపడతారు. ఇతరులతో వాదించడం ప్రారంభిస్తారు. కోపంగా ఉన్నప్పుడు వారికి ఏం చెప్పినా అర్ధం కాదు. అయితే కోపం తగ్గిన అనంతరం ఏది తప్పు.. ఏది కరెక్ట్ అన్న విషయాలను సరిగ్గా అంచనా వేసి అర్ధం చేసుకుంటారు.
Also Read:
రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి
వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!