
Panchagraha Yuti Luck Astrology
ఈ నెల(జనవరి) 19, 20 తేదీల్లో మకర రాశిలో అయిదు గ్రహాలు యుతి చెందడం వల్ల కొన్ని రాశులవారికి అనేక విధాలైన శుభ యోగాలు పట్టబోతున్నాయి. ఆ రెండు రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, ప్రయత్నాలన్నీ వీరికి గ్రాండ్ సక్సెస్ అవుతాయి. రవి, శుక్ర, చంద్ర, కుజ, బుధుల కలయిక వల్ల జీవితాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. మేషం, వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ పంచ గ్రహ కూటమి ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి దశమ స్థానంలో 5 గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో గుర్తింపు లభించడంతో పాటు, యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు లభిస్తాయి. నిరు ద్యోగులు ఆ రెండు రోజుల్లో చేసే ప్రయత్నాలకు తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో సహా అయిదు గ్రహాలు ఇదే రాశిలో చేరడం వల్ల కొద్ది ప్రయత్నంతో ప్రతిదీ సానుకూలంగా సాగిపోతుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. అనేక మార్గాల్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ప్రముఖులతో, ముఖ్యంగా సంపన్నులతో పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలకు, విహార యాత్రలకు వెళ్లడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి రాశ్యధిపతి బుధుడితో సహా అయిదు శుభ గ్రహాలు పంచమ స్థానంలో కలవడంవల్ల రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా పదోన్నతులు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. మనసులోని కోరికల్లో అధిక భాగం నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో లాభాలపరంగా తిరుగుండదు. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.
- తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో అయిదు గ్రహాలు చేరడం వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం అభివృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో శుభ గ్రహాల కలయిక వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవ కాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఆదాయ ప్రయత్నాలను ఎక్కువ చేయడం మంచిది. కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశిలో పంచ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. రాజ పూజ్యాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. త్వరలో ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.