Astrology 2026: కొత్త సంవత్సరంలో విదేశీయాన యోగం ఉన్న రాశులు ఇవే..!

కొత్త సంవత్సరంలో మేషం, కర్కాటకం, సింహం వంటి కొన్ని రాశుల వారికి విదేశీ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. గురు బలం, గ్రహాల అనుకూలతతో విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, స్థిరపడటం వంటివి సాధ్యపడతాయి. నిరుద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇది విదేశీ మూలక ధన లాభాన్ని, ప్రగతిని సూచిస్తుంది.

Astrology 2026: కొత్త సంవత్సరంలో విదేశీయాన యోగం ఉన్న రాశులు ఇవే..!
Overseas Job Astrology

Edited By:

Updated on: Dec 17, 2025 | 6:32 PM

కొత్త సంవత్సరంలో కొన్ని రాశులవారికి విదేశీ అవకాశాలు లభించే సూచనలున్నాయి. ఏ రాశివారికి భాగ్య స్థానాధిపతి బలంగా ఉంటే ఈ రాశివారికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. కొత్త సంవత్సరంలో మారుతున్న గ్రహాల ప్రకారం మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశులవారికి విదేశీయానం కలిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడం, వృత్తి, వ్యాపారాలు చేపట్టడం వంటివి జరుగుతాయి. గురు బలం బాగా పెరుగుతున్నందువల్ల విదేశీ మూలక ధన లాభం కలుగుతుంది. విదేశాల్లో స్థిరత్వం కలిగే అవకాశం కూడా ఉంది.

  1. మేషం: ఈ రాశికి విదేశీ కారక గ్రహాలైన శని, గురు, రాహువులు బాగా బలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి ఫిబ్రవరి తర్వాత తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తులవారికి విదేశాల నుంచి ఆఫర్లే కాక, ఆహ్వానాలు కూడా అందుతాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి ప్రధాన విదేశీ కారక గ్రహాలైన శని, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మే లోగా ఈ రాశివారు విదేశాల్లో ఉద్యోగం సంపాదించే యోగం పడుతుంది. ఈ రాశికి చెందిన వృత్తుల వారు కూడా విదేశీ సంపాదనను అనుభవించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీ పర్యటనలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ఉద్యోగులకు అవకాశాలు పెరగడం, స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులు ఎక్కువగా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది.
  3. సింహం: ఈ రాశిని గురు, రాహువుల బలం జనవరి నుంచి మరింతగా పెరుగుతున్నందువల్ల ఈ రాశి వారికి అతి త్వరలో విదేశీయాన యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడంతో వీరి విదేశీయాన యోగం ప్రారంభమై, చివరికి అక్కడే స్థిరపడేంత వరకూ వెడుతుంది. ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు తప్పకుండా లభిస్తాయి. ఉద్యోగులకు కూడా విదేశీ కంపెనీల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విదేశీ సంబంధాలు ఏర్పడతాయి.
  4. తుల: ఈ రాశికి దశమ స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల విదేశీ అవకాశాలు ఎక్కువగా లభించే అవకాశం ఉంది. ఫిబ్రవరి తర్వాత వీరికి ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఈ రాశివారి ప్రతిభా పాటవాలకు, నైపుణ్యాలకు సర్వత్రా గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. ఇతర దేశాల నుంచి ఆహ్వానాలు అందే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభించడంతో పాటు ఉన్నత పదవులు, భారీ సంపాదన లభిస్తాయి.
  5. ధనుస్సు: రాశ్యధిపతి గురువు ఉచ్ఛపట్టడంతో పాటు రాహువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో విదేశీయానం చేసే అవకాశం ఉంది. విదేశాల్లోనే వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆదాయ వృద్దికి అవకాశాలు కలుగుతాయి. అనేక దేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. విదేశీ సంపాదనను తప్పకుండా అనుభవిస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర దేశాల్లో స్థిరపడడం కూడా ఖాయంగా జరుగుతుంది.
  6. మకరం: ఈ రాశికి తృతీయంలో శని, సప్తమ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల అనేక పర్యాయాలు విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. సాధారణంగా వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు కొన్ని అరుదైన విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు కూడా కొద్ది ప్రయత్నంతో ఇతర దేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో సంబంధం కుదురుతుంది. విదేశీ ఆదాయం బాగా వృద్ది చెందుతుంది.