Kuja Gochar: కుజుడి అనుగ్రహం.. ఈ రాశుల వారి ఆదాయం, ఐశ్వర్యం పెరిగే ఛాన్స్..!
Mars Transit in Taurus 2026: జూన్ 21 నుంచి ఆగస్టు 2 వరకు కుజుడు వృషభ రాశిలో సంచరించబోతున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆర్థిక పురోగతి, ఆదాయ వృద్ధి అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి కుజుడి శుభ ప్రభావంతో పట్టుదల, ధైర్యం, కార్యసాధన శక్తి పెరిగి వివిధ రంగాల్లో లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే విలాసాలు, సుఖసౌకర్యాల కోసం ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.

కుజుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి లక్షణాలు మరింత విజృంభిస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ నెల (జూన్) 21 నుంచి ఆగస్టు 2 వరకు కుజుడు సహజ దన స్థానమైన వృషభ రాశిలో ప్రవేశి స్తున్నందు వల్ల కొన్ని రాశుల వారికి సంపాదన మీద వ్యామోహం బాగా పెరుగుతుంది. విలాసాలు, సుఖ సంతోషాల మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు పట్టుదలకు, పోరాటానికి, మొండి ధైర్యానికి మారుపేరైన ఈ కుజుడి వల్ల 42 రోజుల పాటు రకరకాలుగా లబ్ధి పొందడం జరుగుతుంది.
మేషం
ఈ రాశికి వృషభ రాశి ధన స్థానం కావడం, అందులో రాశ్యధిపతి కుజుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ధన సంపాదన మీదకు దృష్టి మళ్లుతుంది. ఎంత శ్రమకైనా ఓర్చి పట్టుదలగా అదనపు ఆదాయానికి ప్రయత్నించడం జరుగుతుంది. కుజుడు విజయం చేజిక్కించుకోనిదే దేనినీ వదిలి పెట్టడు. ఆదాయం పెరగడంతో పాటు, ఆస్తి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బును, రాదనుకున్న డబ్బును కూడా రాబట్టుకుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది.
వృషభం
ఈ రాశివారికి ఆదాయ వృద్ధి మీద వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో కుజుడు ప్రవేశించిన తర్వాత ఈ ధన కాంక్ష మరింతగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల మీద పెట్టుబడులు పెట్టడంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను ఎక్కువగా అనుసరిస్తారు. ఆదాయ వృద్ధే వీరికి ఏకైక లక్ష్యంగా మారుతుంది. వీరి ప్రయత్నాల వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.
కర్కాటకం
ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు లాభ స్థానంలోకి ప్రవేశించడం వల్ల వ్యక్తిగత పురోగతి మీద వ్యామోహం బాగా పెరుగుతుంది. అధికారం చెలాయించాలని, ఆదాయాన్ని పెంచుకోవాలని గట్టి ప్రయత్నాలు సాగించడం జరుగుతుంది. ఆస్తి వివాదాలను, కోర్టు కేసులను రాజీమార్గంలో పరిష్క రించుకుని లబ్ధి పొందుతారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ప్రయత్నాలు సాగిస్తారు. కొందరు మిత్రులతో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. షేర్లు బాగా లాభిస్తాయి.
సింహం
ఈ రాశికి దశమ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి అధికారం మీద బాగా ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత పదవులు చేపట్టడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడానికి గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదల కోసం కృషి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాల్ని పెంచుకునేందుకు కొత్త పద్ధతులు, వ్యూహాలు చేపడతారు. ఆస్తి వివాదాల్ని పరిష్కరించుకుంటారు. జీవితంలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరపడడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తారు.
వృశ్చికం
రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థానమైన వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల అదనపు ఆదాయ ప్రయత్నాల మీద ఈ రాశివారు ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల మీద పెట్టుబడులు పెంచుతారు. రావలసిన డబ్బును, బాకీలు, బకాయిలను పట్టుదలగా రాబట్టుకుంటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరిగే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
మకరం
ఈ రాశికి పంచమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారు అదనపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెంచుతారు. రావలసిన డబ్బును పట్టుదలగా రాబట్టుకుంటారు. చర, స్థిరాస్తులను పెంచుకోవడానికి అత్యధికంగా శ్రమపడతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఆర్థిక అవసరాలను తీర్చుకుంటారు. ఉద్యోగంలో అదనపు ఆదాయానికి ప్రయత్నిస్తారు. వీరి శ్రమ ఫలించి ఆదాయం వృద్ధి చెందుతుంది.
కుంభం
ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి సంపదను, ఆస్తిపాస్తులను పెంచు కోవడం మీద బాగా మోజు పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి అవకాశాన్నీ వదులుకునే అవకాశం ఉండదు. ఆస్తి వివాదాల్ని రాజీమార్గంలో పరిష్కరించుకుని లబ్ది పొందు తారు. సొంత ఇల్లు, వాహనం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఆస్తిపాస్తుల్ని సమకూర్చుకుంటారు. స్థలాలు, ఇళ్ల మీద పెట్టుబడులు పెడతారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద మదుపు చేస్తారు.
Also Read: గజకేసరి యోగం.. వచ్చే వారం ఈ రాశుల వారి దశ తిరిగినట్టే! ఇందులో మీ రాశి ఉందా?
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)



