AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజకేసరి యోగం.. వచ్చే వారం ఈ రాశుల వారి దశ తిరిగినట్టే! ఇందులో మీ రాశి ఉందా?

Jupiter-Moon Conjunction: జూన్ 17 నుంచి 19 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ గురువు, స్వక్షేత్ర చంద్రుడు కలయికతో అత్యంత శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ప్రభావంతో ఆదాయ వృద్ధి, కార్యసిద్ధి, శుభ నిర్ణయాలు, ఆకస్మిక అవకాశాలు కలిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ మూడు రోజులు విశేషంగా అనుకూలంగా ఉండనున్నాయి.

గజకేసరి యోగం.. వచ్చే వారం ఈ రాశుల వారి దశ తిరిగినట్టే! ఇందులో మీ రాశి ఉందా?
Gajakesari Yoga 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 5:03 PM

Share

ఈ నెల(జూన్) 17, 18, 19 తేదీల్లో కర్కాటక రాశిలో ఉచ్ఛ గురువుతో రాశ్యధిపతి చంద్రుడి యుతి జరిగి గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఉచ్ఛ గురువుతో స్వక్షేత్ర చంద్రుడు కలవడం వల్ల ఈ యోగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ యోగం అనుకూలంగా ఉన్న రాశులవారు తప్పకుండా ఏనుగు కుంభ స్థలాన్ని కొడతారు. ఈ యోగం ఆదాయ వృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఈ గజకేసరి యోగ కాలంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు, ప్రయత్నాలు అతి తక్కువ కాలంలో నెరవేరే అవకాశం ఉంటుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ యోగం బాగా లాభిస్తుంది.

మేషం

మేష రాశికి చతుర్థ స్థానంలో అత్యంత విశిష్టమైన గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశి వారికి పట్టపగ్గాలుండవు. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

మిథునం

మిథున రాశికి ధన స్థానంలో ధనాధిపతి చంద్రుడు అత్యంత శుభ గ్రహాలైన గురు, శుక్రులతో యుతి చెందడం వల్ల మహాభాగ్య యోగం, సౌభాగ్య యోగం కలుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం సఫలమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లే అవకాశం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం పడుతుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

కర్కాటక రాశిలో రాశినాథుడికి ఉచ్ఛ గురువుతో యుతి కలగడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రు, రోగ, రుణ సమస్యల మీద విజయాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉన్నత వర్గాలతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.

కన్య

కన్య రాశికి లాభ స్థానంలో ఈ ఉత్తమ స్థాయి గజకేసరి యోగం ఏర్పడడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. కెరీర్ పరంగా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ మూడు రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.

తుల

తుల రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో చంద్రుడికి యుతి ఏర్పడడం వల్ల పూర్తి స్థాయి గజకేసరి యోగం ఏర్పడింది. దీని వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అదనపు రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

వృశ్చికం

వృశ్చిక రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువుతో చంద్రుడికి యుతి ఏర్పడడం వల్ల కలలో కూడా ఊహించని రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు, పదోన్నతి కూడా కలుగుతుంది. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.

మకరం

మకర రాశికి సప్తమంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో చంద్రుడు కలవడం వల్ల అరుదైన గజకేసరి యోగం ఏర్పడింది. దీని వల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆదాయపరంగా దూసుకుపోయే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగు తుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు.

మీనం

మీన రాశి వారికి పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువుతో పంచమాధిపతి చంద్రుడు యుతి చెందడం వల్ల మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఘన విజయం సాధిస్తాయి.

Follow Us