Job Astrology: త్వరలో వారికి ఉద్యోగ యోగం..! ఇందులో మీ రాశి ఉందా..?
Career Horoscope 2026: గ్రహాల ప్రస్తుత సంచారం ప్రకారం జాతక చక్రంలోని దశమ స్థానం (ఉద్యోగ స్థానం) బలపడడంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగపరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రాశుల వారు వచ్చే రెండు నెలల్లో ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు లేదా కెరీర్‌లో కీలక పురోగతిని పొందే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన ఉద్యోగం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో పదవ స్థానాన్ని బట్టి ఉద్యోగం గురించి చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రహ సంచారంలో దశమ స్థానాన్ని బట్టి కొన్ని రాశుల వారి ఉద్యోగ భవిష్యత్తును, వృత్తి, వ్యాపారాలను అంచనా వేయవలసి ఉంటుంది. దశమ స్థానంలో.. అంటే ఉద్యోగ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఏడు రాశుల వారి జీవితాల్లో త్వరలో ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రాశులవారికి వచ్చే రెండు నెలల కాలంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి త్వరలో ఉద్యోగ యోగం పట్టబోతోంది.
వృషభం
ఈ రాశికి దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారికి డిసెంబర్ 5 లోపల విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో ఉన్నవారి జీవితాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యో గంలోకి మారే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వీరికి ఉద్యోగమూలక ధన లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.
మిథునం
ఈ రాశికి దశమంలో శని సంచారం వల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లోను, ఇంటర్వ్యూలలోనూ ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగపరంగా తప్పకుండా శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు ప్రాధా న్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉన్నతాధికారులకు లేదా యాజమాన్యానికి దగ్గరవుతారు. ఉద్యోగులు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారే సూచనలున్నాయి.
కర్కాటకం
ఈ రాశికి దశమ స్థానంలో దశమాధిపతి కుజుడు సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశివారికి మరి కొద్ది రోజుల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి ఉద్యోగ స్థిరత్వం, నివాస స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
సింహం
ఈ రాశికి దశమంలో ఈ నెల 16 వరకు రాశ్యధిపతి రవి, ఆ తర్వాత 20 నుంచి కుజుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. సాధారణంగా వీరికి సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లోని ఉద్యోగులకు తప్పకుండా కోరుకున్న స్థిరత్వం లభిస్తుంది.
కన్య
ఈ రాశికి దశమ స్థానంలో దశమాధిపతి బుధుడి సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. స్థాన చలనానికి బాగా అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
తుల
ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో పాటు గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తు న్నందువల్ల విదేశీ అవకాశాలు ఎక్కువగా లభించే అవకాశం ఉంది. వీరికి విదేశీ సంపాదన యోగం కలుగుతోంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.
వృశ్చికం
ఈ రాశికి దశమ స్థానంలో కేతువు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఊహించని విధంగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అతి త్వరలో ఈ రాశివారికి తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత ఊర్లోనే మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా పురోగతి చెందుతాయి.



