హిందూ మతంలో మకర సంక్రాంతి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున సూర్యుడు ఉత్తరం వైపు కదలడం ప్రారంభిస్తాడు. కనుక ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. ఇది హిందువుల ప్రధాన పండుగ.. కొత్త ఆంగ్ల సంవత్సరంలో జరుపుకునే మొదటి పండుగ. మకర సంక్రాంతి నాడు పవిత్ర నదులలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు
ఈ ఏడాది జనవరి 14వ తేదీ ఉదయం 9.03 గంటలకు సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. మకర సంక్రాంతి రోజున పుష్య నక్షత్రంతో పాటు విష్కుంభ యోగం, బలవ్, కౌవల్ కరణాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో ఏర్పడిన ఈ యోగాలతో కొన్ని రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ రోజు ఏయే రాశుల వారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం..
కర్కాటక రాశి: సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశిచక్రంలోని 7వ ఇంట్లో సంచరిస్తాడు. అటువంటి పరిస్థితిలో కర్కాటక రాశి వారికి అన్ని రంగాలలో విజయావకాశాలు లభిస్తాయి. ఆర్థిక లాభం కూడా ఉండవచ్చు. ఎప్పటి నుంచో ఆగిన పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. పాత మిత్రులను కలుసుకోవచ్చు. ఈ రాశికి చెందిన ఉద్యోగులు తమ పనికి తగిన ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారస్తులు లాభాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగు ఉంటుంది. ఆరోగ్యం పరంగా బాగుంటారు.
తులా రాశి: మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత సూర్యుడు ఈ రాశిచక్రంలోని నాల్గవ ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో తుల రాశి వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా విజయం సాధించవచ్చు. వ్యాపారస్తులపనులు విజయవంతం అవుతాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధించవచ్చు.
మీన రాశి: మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత సూర్యుడు ఈ రాశిలోని 11వ ఇంట్లో సంచరించనున్నాడు. మీన రాశి వారు ఈ సమయంలో ఎంతో ప్రయోజనం పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులు తమ పనుల్లో లాభాలను పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.