హిందూ మతంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మహా శివరాత్రి మార్చి 8, 2024 శుక్రవారం రోజున జరుపుకోనున్నారు. ఈ రోజున శివయ్యను పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా మనిషి ప్రతి రంగంలో విజయం సాధించి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతాడు. మహా శివరాత్రి రోజున శివుని ఆరాధించడం, సర్వార్థ సిద్ధి యోగం కోసం ఉపవాసం చేయడం ద్వారా.. ప్రతి వ్యక్తి విజయాన్ని పొందుతాడు.\
సుమారు 300 సంవత్సరాల తర్వాత శివరాత్రి రోజున చాలా అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి శివుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని జ్యోతిష్యులు చెప్పారు. ఈ సంవత్సరం 2024 మహాశివరాత్రి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజు శుక్ర ప్రదోష వ్రతంతో సమానంగా ఉంటుంది.
ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా ఈ రోజున ఏర్పడనున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎవరైనా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివయ్యను పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రిలలో మహా శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
మహా శివరాత్రి నాడు శివుని ఆరాధించడం, సర్వార్థ సిద్ధి యోగం కోసం ఉపవాసం చేయడం ద్వారా ఎవరైనా సరే విజయాన్ని అందుకుంటారు. 300 ఏళ్ల తర్వాత ఈసారి మహా శివరాత్రి నాడు ఈ త్రికోణ యోగం ఏర్పడనుంది. ఈ అరుదైన యోగాం ఏర్పడిన శుభ సమయంలో శంకరుడిని పూజించడం ద్వారా భక్తులు కోరుకున్న ఫలితాలను పొందుతారు. మహాశివరాత్రి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం శ్రేయస్కరం. చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయడం ద్వారా శివ పార్వతులు ప్రసన్నురాలవుతారు. భార్యాభర్తలు కలిసి శివలింగానికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తే.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
దాదాపు 300 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున ఇలాంటి యాదృచ్చికం జరగబోతోంది. మకరరాశిలో కుజుడు, చంద్రుడు కలవడం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడుతోంది. దీనితో పాటు కుంభరాశిలో శుక్ర, శని, సూర్యుని కలయిక వల్ల మీనరాశిలో రాహువు, బుధ గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఇటువంటి శుభ యోగాలు అనేక రాశులకు చెందిన వారి జీవితాల్లో ఆనందాన్ని కలిగిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు