Lucky Zodiac Signs: తుల రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..!

Lucky Astrology 2024: మిత్ర క్షేత్రమైన తులా రాశిలో ఈ నెల 11న ప్రవేశించబోతున్న బుధుడు కొన్ని రాశుల వారికి ఏదో ఒక మంచి చేయనిదే అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉండదు. ఈ నెల 29 వరకూ ఇదే రాశిలో కొనసాగుతున్న బుధుడు తులా రాశిలో కూడా దాదాపు ఉచ్ఛ ఫలితాలనే ఇస్తాడు. బుద్ధి చాతుర్యానికి, నైపుణ్యాలకు, ఆర్థిక వ్యవహారాలకు కారకుడైన బుధుడు తులా రాశిలో ఉన్న ప్పుడు తప్పకుండా వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తాడు.

Lucky Zodiac Signs: తుల రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..!
Lucky Astrology 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 04, 2024 | 5:49 PM

Budh Gochar 2024: మిత్ర క్షేత్రమైన తులా రాశిలో ఈ నెల 11న ప్రవేశించబోతున్న బుధుడు కొన్ని రాశుల వారికి ఏదో ఒక మంచి చేయనిదే అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉండదు. ఈ నెల 29 వరకూ ఇదే రాశిలో కొనసాగుతున్న బుధుడు తులా రాశిలో కూడా దాదాపు ఉచ్ఛ ఫలితాలనే ఇస్తాడు. బుద్ధి చాతుర్యానికి, నైపుణ్యాలకు, ఆర్థిక వ్యవహారాలకు కారకుడైన బుధుడు తులా రాశిలో ఉన్న ప్పుడు తప్పకుండా వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తాడు. ఉద్యోగంలో తన సమర్థతను నిరూపించుకుంటాడు. ఆదాయపరంగానే కాక, అన్ని వ్యవహారాల్లోనూ తనది పైచేయి అని నిరూపించుకోవడంతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం అందిస్తాడు. మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులు తులా బుధుడి వల్ల అదృష్టం పండించుకోబోతున్నాయి.

  1. మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు సంచారం చేయడం విశేష రాజయోగాలను సూచిస్తుంది. ఈ రాశివారికి 15 రోజుల పాటు ఆదాయపరంగా, ఉద్యోగపరంగా తిరుగుండదు. అతి క్లిష్టమైన వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఒక వెలుగు వెలు గుతాయి. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. లాభదాయకమైన వ్యవహారాలు చేపడతారు.
  2. కన్య: రాశ్యధిపతి బుధుడు ధన స్థానమైన తులా రాశిలో ప్రవేశించడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో వేతనాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవ హారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతో షాలతో సాగిపోతాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది.
  3. తుల: ఈ రాశిలో భాగ్య స్థానాధిపతిగా బుధ సంచారం వల్ల నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిం చడం, అవివాహితులకు విదేశీ సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. తల్లితం డ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. విహార యాత్రలు, తీర్థ యాత్రలు చేసే అవకాశం ఉంది.
  4. ధనుస్సు: ఈ రాశివారికి దశమాధిపతిగా లాభ స్థానంలో బుధ సంచారం ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవ కాశం కల్పిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించడం, జీతభత్యాలు బాగా పెరగడం వంటివి జరు గుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశికి దశమ స్థానంలో భాగ్యాధిపతి బుధుడి ప్రవేశం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు, సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త అవకాశాల అంది వస్తాయి. విదేశాల నుంచి ఆఫర్లు అందే సూచనలు కూడా ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. సామాజికంగా రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  6. కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలకు కూడా విదేశీ సంబంధాలు ఏర్పడతాయి. విదేశీ ధనం అనుభవించే యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. పిల్లలు చదువుల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి. మనసులోని ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేరుతాయి.

ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!