Lord Shani Dev
ప్రస్తుతం కుంభ రాశిలో, స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడికి క్రమంగా బలం పెరుగుతోంది. మరో పది నెలల పాటు కుంభరాశిలోనే సంచారం చేయబోతున్న శనీశ్వరుడికి మిత్ర గ్రహాలైన శుక్ర, బుధులతో యుతి కలుగుతున్నందువల్ల శనికి బలం పెరగడం జరుగుతోంది. మరో రెండు నెలల పాటు ఈ రకమైన యుతి కొనసాగుతుంది. దీనివల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారి మీద శనీశ్వరుడు కనక వర్షం కురిపించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, ఆస్తుల పరంగా, ఇతరత్రా ఆర్థిక ప్రయత్నాల పరంగా ఈ రాశుల వారు ఉత్తమ జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశివారికి అత్యంత యోగదాయకుడైన శనీశ్వరుడు ప్రస్తుతం ఉద్యోగ స్థానంలో సంచరించడం, అందులోనూ రాశ్యధిపతి శుక్రుడితో యుతి చెందుతుండడం వల్ల తప్పకుండా ఐశ్వర్యాన్నిచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో అంచనాలకు మించిన ఆదాయం, అదనపు రాబడి ఉంటాయి. ఏ రంగంలో ఉన్నవారైనా వారికి ప్రాభవం, ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు.
- మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో శనీశ్వరుడు సంచారం చేస్తుండడం, పైగా రాశ్యధిపతి బుధుడితో కల వడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృష్టం పడుతుంది. అనేక మార్గాల్లో డబ్బు కలిసి వస్తుంది. వారసత్వపు ఆస్తి లభిస్తుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరి ష్కారం అవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కలుగుతుంది. ఆర్థికంగా, కెరీర్ పరంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది.
- కన్య: ప్రస్తుతం ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అన్ని విధాలుగానూ ధన యోగాన్ని కలిగించడం, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయడం జరుగుతుంది. ఇప్పుడు రాశ్య ధిపతి బుధుడు, ఈ రాశికి యోగకారకుడైన శుక్రుడు వరుసగా శనితో కలుస్తున్నందువల్ల శనీ శ్వరుడు మరింతగా ఈ రాశివారికి ధన, ధాన్య, వస్తు సంపదనిచ్చే అవకాశం ఉంది. అన్ని సంపదలతో పాటు ఆరోగ్య భాగ్యాన్ని కూడా ప్రసాదించే అవకాశం ఉంది. ఆస్తి బాగా కలిసి వస్తుంది.
- తుల: ఈ రాశికి అత్యంత యోగదాయక గ్రహమైన శనీశ్వరుడు తన స్వస్థానంలో సంచరించడం, రాశ్యధిపతి శుక్రుడితో యుతి చెందడం వల్ల ఈ రాశికి శని మరింత యోగదాయకుడుగా మారడం జరుగుతుంది. ఈ రాశివారికి ప్రబలమైన లక్ష్మీయోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రాశివారి ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వాహన యోగం పడుతుంది.
- మకరం: ఈ రాశ్యధిపతి అయిన శనీశ్వరుడు ధన స్థానంలో సంచరించడం ఒక విశేషం కాగా, ఈ రాశికి యోగ కారకులైన శుక్ర, బుధులతో యుతి చెందడం మరో విశేషం. ఈ రాశివారికి తప్పకుండా ఐశ్వర్య యోగం పడుతుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది. విదేశాల నుంచి సైతం ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఇప్పుడు తలపెట్టే ఆర్థిక ప్రయత్నాలన్నీ ఖాయంగా శుభ ఫలితాలనిస్తాయి.
- కుంభం: ఈ రాశ్యధిపతి శనీశ్వరుడు ఇదే రాశిలో సంచారం చేస్తుండడం, పైగా శుక్ర, బుధులతో కలవడం వల్ల ఈ రాశివారికి సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కువతారు. రాజకీయంగా బాగా ఎదిగే సూచనలున్నాయి. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఆర్థిక సంబంధమైన ఎటు వంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. మహా భాగ్య యోగం కలిగే అవకాశం ఉంది.