Kuja Dosha: నీచ కుజుడితో మాంగల్య దోషం..! ఈ విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త

| Edited By: Janardhan Veluru

Oct 17, 2024 | 6:43 PM

Mangalya Dosha: అక్టోబర్ 21 నుంచి జనవరి 12 వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగు తుంది. కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకర రాశుల వారి మీద కుజ దోష ప్రభావం పడుతుంది. కుజ దోషాన్నే మాంగల్య దోషమని కూడా అంటారు. దీని ప్రభావం వైవాహిక జీవితం మీద ఎక్కువగా ఉంటుంది.

Kuja Dosha: నీచ కుజుడితో మాంగల్య దోషం..! ఈ విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త
Kuja Dosham
Follow us on

ఈ నెల 21 నుంచి జనవరి 12 వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగు తుంది. కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకర రాశుల వారి మీద కుజ దోష ప్రభావం పడుతుంది. కుజ దోషాన్నే మాంగల్య దోషమని కూడా అంటారు. దీని ప్రభావం వైవాహిక జీవితం మీద ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఏ రాశికైనా 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం ఏర్పడుతుంది. ఇందులో ఒక్కొక్క రాశికి ఈ దోషం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ దోష నివారణకు ప్రతి రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.

  1. మేషం: కుజుడు ఈ రాశికి చతుర్థ స్థానంలో నీచబడుతున్నందువల్ల ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. కొద్దిగా కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది. జీవిత భాగస్వామితో వాదోప వాదాలకు దిగకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయ వలసి రావడం వల్ల కుటుంబంలో కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రుల రాకపోకలు కూడా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలను జాగ్రత్తగా చక్కదిద్దుకోవలసిన అవసరం ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశికి కుటుంబ స్థానంలో కుజ దోషం ఏర్పడడం వల్ల తొందరపాటు వ్యవహారాలు, తొందర పాటు నిర్ణయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయాన్నీ అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వృథా ఖర్చుల వల్ల కూడా సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకపోవడం మంచిది. ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కొద్ది కాలం పాటు కుటుంబ వ్యవహారాల్లో, దాంపత్య జీవితంలో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం.
  3. కర్కాటకం: ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయవలసి రావడం వల్ల, ఉద్యోగంలో పని భారం పెరగడం వల్ల కుటుంబ వ్యవహారాలు కొద్దిగా పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అకారణ మాట పట్టింపులకు అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబం మీద లేదా జీవిత భాగస్వామి మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
  4. సింహం: ఈ రాశివారికి జీవిత భాగస్వామితో కొద్దిపాటి ఎడబాటు కలిగే అవకాశం ఉంది. దాంపత్య జీవి తంలో సుఖ సంతోషాలు తగ్గే సూచనలున్నాయి. దంపతుల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ కావడం లేదా దూర ప్రాంతంలో మరింత మంచి ఉద్యోగం లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. బంధువుల కారణంగా కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కుటుంబం మీద ఖర్చులు బాగా పెరగడం వల్ల కోపతాపాలు, అసహనం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడుతోంది. దీనివల్ల దంప తుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. జీవిత భాగస్వామి మీద, కుటుంబం మీద ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కోపతాపాలను హద్దుల్లో ఉంచుకోవడం చాలా అవసరం. తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాల వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తడానికి అవకాశం ఉంది. పిల్లల కారణంగా కూడా దంపతుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు.
  7. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో తప్పకుండా టెన్షన్లు, మానసిక ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి అహంకారపూరిత వైఖరి కొద్దిగా ఎడబాటుకు అవకాశమిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావడం, శ్రమాధిక్యత ఎక్కువగా ఉండడం కూడా దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తడానికి దారి తీయవచ్చు. జీవిత భాగస్వామికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి