Ketu Gochar 2024
ప్రస్తుతం కన్యా రాశిలో సంచారం చేస్తున్న కేతు గ్రహం మీద శుభ గ్రహాల సంచారం ప్రారంభమైంది. గురు, బుధ, శుక్రులతో పాటు, రవి ప్రభావం కూడా ఈ గ్రహం మీద పడడం వల్ల ఈ వక్ర గ్రహం పూర్తిగా శుభ గ్రహం కాబోతోంది. తాజాగా ఈ గ్రహం తనకు ఇష్టమైన హస్తా నక్షత్రం మీదుగా సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు అనేక శుభ యోగాలను కలిగించడంతో పాటు, జీవితాన్ని మలుపు తిప్పగల శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది. ఈ గ్రహ బలం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశులకు అనేక కోరికలు, ఆశయాలు తీరే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో కలిసిన కేతువు వల్ల సంతాన యోగానికి అవ కాశం ఉంది. వీరి ప్రతిభా పాటవాలకు సర్వత్రా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బ డిగా వృద్ధి చెందుతుంది. వీరి ప్రణాళికలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృక్తిగత, కుటుంబ, ఆర్థిక సమ స్యలతో పాటు ఆరోగ్య సమస్యల నుంచి కూడా చాలావరకు విముక్తి లభించే అవకాశముంది. నిరు ద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
- కర్కాటకం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కేతువు శుభ గ్రహంగా మారుతున్నందువల్ల అనేక విధాలైన అభివృద్ధి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. విదేశీయానానికి మార్గం సుగ మం అవుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- సింహం: ఈ రాశికి ధన స్థానంలో లాభాధిపతి శుక్రుడితో కలిసిన కేతువు వల్ల ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యో గంలో వేతనాలు అంచనాలకు మించి వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కష్ట నష్టాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతాయి. మీ సలహాల వల్ల బంధు మిత్రులు లబ్ధి పొందుతారు. రాజకీయ ప్రముఖులకు బాగా సన్నిహితం అవుతారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి లాభస్థానంలో ఉన్న కేతువు భాగ్యాధిపతి చంద్రుడి నక్షత్రమైన హస్తా నక్షత్రంలో సంచా రం చేయడం ఆదాయపరంగా శుభ సూచకమవుతుంది. ఈ ఆదాయ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లోనే కాక, వ్యక్తిగతంగా కూడా యాక్టివిటీ పెరిగి లభ్ధి పొందడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవు తుంది. మంచి వ్యక్తితో ప్రేమలోపడే అవకాశం ఉంది. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది.
- మకరం: ఈ రాశికి నవమ స్థానంలో, అంటే భాగ్య స్థానంలో కేతువు ఉండడమే ఒక శుభ సూచకం కాగా, దాని మీద శుభ గ్రహాల ప్రభావం పడడం మరింత శుభ సూచకం. విదేశీయానానికి అవకాశాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా విదేశాలకు వెళ్లడం, ఆదాయం గడించడం జరుగుతుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న తీర్థయాత్రలను పూర్తి చేస్తారు. మొక్కుబడులు తీర్చుకుం టారు. పిత్రార్జితం లభించడానికి అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు.
- మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న కేతువు శుభ గ్రహాల యుతి కారణంగా శుభ గ్రహంగా మారడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలకు అంచనాలకు మించిన ఆఫర్లు అందుతాయి. సాధారణంగా విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. పలుకుబడి కలిగిన కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమ వుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి