Money Astrology 2024: గురువు అనుగ్రహం.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!

| Edited By: Janardhan Veluru

Jun 22, 2024 | 5:43 PM

Jupiter Transit: లగ్నం లేదా రాశి నుంచి గురువు అనుకూల స్థానంలో ఉన్న పక్షంలో జీవితాంతం కొండంత అండగా నిలబడతాడు. ఏ గ్రహం సరిగ్గా లేకపోయినా, ఏ దశ అనుకూలంగా లేకపోయినా జాతక చక్రంలో గురువు ఒక్కడూ అనుకూల రాశిలో ఉన్నట్టయితే, అది కష్టనష్టాల నుంచి కాపాడుతుంది. గ్రహచారంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది.

Money Astrology 2024: గురువు అనుగ్రహం.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
Jupiter Transit
Follow us on

లగ్నం లేదా రాశి నుంచి గురువు అనుకూల స్థానంలో ఉన్న పక్షంలో జీవితాంతం కొండంత అండగా నిలబడతాడు. ఏ గ్రహం సరిగ్గా లేకపోయినా, ఏ దశ అనుకూలంగా లేకపోయినా జాతక చక్రంలో గురువు ఒక్కడూ అనుకూల రాశిలో ఉన్నట్టయితే, అది కష్టనష్టాల నుంచి కాపాడుతుంది. గ్రహచారంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఏ రాశికైనా గురువు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా శుభ ఫలితాలే అనుభవానికి వస్తాయి. చివరికి ఏలిన్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి శని దోషాలు సైతం తొలగిపోతాయి. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం, 2025 మే నెల వరకు గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల, మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు అనేక విధాలుగా కలిసి వస్తూ ఉంటుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి బయటపడడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి గురువు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు చాలావరకు తగ్గిపోతాయి. కుటుంబంలో చాలా కాలంగా పెండింగులో ఉన్న పెళ్లిళ్లు, గృహ ప్రవే శాలు, విదేశీ ప్రయాణాలు, తీర్థయాత్రలు వంటివి విజయవంతంగా, సంతృప్తికరంగా నెరవేరు తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఇంట్లోకి ధన ప్రవాహం ఉంటుంది. మాటకు విలువ పెరు గుతుంది. మానసిక పరిస్థితి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ప్రేమలు సఫలం అవుతాయి.
  2. వృషభం: ఈ రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి అనేక కష్టనష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులు, సంపన్ను లతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ధన ధాన్య వృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారు అష్టమ శని కారణంగా అష్టకష్టాలు పడే యోగం ఉన్నప్పటికీ, లాభ స్థానంలో గురు సంచారం వల్ల ఈ శని దోషం మటుమాయం అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది. అధికారుల నుంచి సానుకూలతలు పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. అనారోగ్యానికి అవసరమైన వైద్య సహాయం అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో గురు సంచారం నిజంగా ఈ రాశివారికి పెద్ద ఆస్తి కింద లెక్క. గ్రహ సంచారంలోనే కాకుండా, గ్రహ సంచారంలో కూడా ఎటువంటి శని, కుజ, రాహు దోషాలున్నా, ఎటువంటి అవయోగాలున్నా కొట్టుకుపోతాయి. అనేక విధాలుగా భాగ్యం కలిసి వస్తుంది. అటు ఉద్యోగంలోనూ, ఇటు పెళ్లి విషయంలోనూ విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి అర్ధాష్టమ శని ప్రభావం బాగా తగ్గిపోవడానికి సప్తమ గురువు బాగా తోడ్పడుతుంది. ఈ రాశికి పెళ్లిపరంగా అనేక అనుకూలతలు కలుగుతాయి. వైవాహిక సమస్యలు ఏవైనా ఉంటే సమసిపోతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుంది. రుణ సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.
  6. మకరం: ఈ రాశివారికి పంచమ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. స్థితిగతులు పూర్తిగా మారిపోయి, అభివృద్ది బాటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వాళ్ల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.