Job Astrology: అనుకూల స్థితిలో కీలక గ్రహాలు.. ఈ ఏడాది చివరికల్లా వారికి ఉద్యోగ యోగం.. !

| Edited By: Janardhan Veluru

Dec 07, 2023 | 6:25 PM

ఈ ఏడాది ముగుస్తున్న స్థితిలో ఈ ఏడాది చివరి లోగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది నిరుద్యోగులకు పెద్ద ప్రశ్నగా మారుతోంది. కొన్ని రాశులకు శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఎనిమిది రాశులకు చెందిన నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా శనీశ్వరుడు స్వస్థానంలో సంచారం చేస్తుండడం, గురు, శుక్ర, బుధులు అనుకూలంగా ఉండడం వల్ల..

Job Astrology: అనుకూల స్థితిలో కీలక గ్రహాలు.. ఈ ఏడాది చివరికల్లా వారికి ఉద్యోగ యోగం.. !
Job Astrology
Follow us on

ఈ ఏడాది ముగుస్తున్న స్థితిలో ఈ ఏడాది చివరి లోగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది నిరుద్యోగులకు పెద్ద ప్రశ్నగా మారుతోంది. కొన్ని రాశులకు శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఎనిమిది రాశులకు చెందిన నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా శనీశ్వరుడు స్వస్థానంలో సంచారం చేస్తుండడం, గురు, శుక్ర, బుధులు అనుకూలంగా ఉండడం వల్ల మేషం, వృషభం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ ఏడాది చివరి లోగా, అంటే డిసెంబర్ ముగిసే లోగా ఉద్యోగావకాశాలు అంది వస్తాయి.

  1. మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో జీవన కారకుడు, దశమాధిపతి అయిన శనీశ్వరుడు సంచరిస్తు న్నందు వల్ల, శుక్రుడు, బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా కోరుకున్న కంపెనీల నుంచి ఆశించిన ఉద్యోగానికి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు వెంటనే సానుకూల స్పందన లభించే అవకాశం కూడా ఉంది. అయితే, విదేశాల్లో కానీ, దూర ప్రాంతాల్లో కానీ ఉద్యోగం లభించవచ్చు.
  2. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో దశమాధిపతి శనీశ్వరుడు సంచరించడంతో పాటు రాశ్యధిపతి శుక్రుడు సేవా స్థానమైన షష్ట స్థానంలో ప్రవేశించినందువల్ల ఈ రాశివారికి కొద్ది రోజుల్లో తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మూడు నాలుగు ఆఫర్లు అంది వచ్చే అవకాశం కూడా ఉంది. సాధారణంగా సొంత ఊర్లో లేదా బాగా దగ్గర ప్రాంతంలో ఉద్యోగం లభించడం, అందులో స్థిరపడడం జరుగుతుంది. అది తాను బాగా కోరుకున్న ఉద్యోగం అవుతుంది.
  3. సింహం: ఈ రాశివారికి జీవన కారకుడైన శనీశ్వరుడు సప్తమ స్థానంలో, స్వక్షేత్రంలో సంచరించడం ఉద్యోగపరంగా అనుకూలతలను కలిగిస్తుంది. అంతేకాక, దశమ స్థానంపై రాశ్యధిపతి రవి దృష్టి పడడం వల్ల కూడా కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా సొంత ఊర్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగాల పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశివారికి సేవా స్థానంలో శనీశ్వరుడి సంచారం, ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అతి తేలికగా మంచి ఉద్యోగాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఆశించిన జీతభత్యాలతో, కోరుకున్న ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలలో మంచి విజయాలు సాధించే అవ కాశం ఉంది. ఇష్టమైన ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగా లకు ప్రయత్నించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అందవచ్చు.
  5. తుల: ఈ రాశివారికి ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉండడం, ఈ రాశి మీద నుంచి రాశినాథుడు శుక్రుడు వెడుతుండడం వంటి కారణాల వల్ల కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ ఘన విజయాలు లభిస్తాయి. సాధారణంగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ నెలా ఖరులోగా ఉద్యోగపరంగా స్థిరపడే సూచనలున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు రావడం జరుగుతుంది.
  6. వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానాధిపతి అయిన రవి ఇదే రాశిలో సంచరించడంతో పాటు, రాశ్యధిపతి కూడా ఇదే రాశిలో ఉండడం, శనీశ్వరుడు ఉద్యోగ స్థానాన్ని వీక్షించడం వల్ల ఈ రాశివారికి కొద్ది శ్రమతో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఉంది. ఇంటర్వ్యూల్లో బాగా రాణించే సూచనలున్నాయి. సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఇదే ఉద్యోగంలోనే స్థిరపడడం జరుగు తుంది.
  7. ధనుస్సు: ఈ రాశివారికి ఉద్యోగకారకుడైన శనీశ్వరుడు తృతీయంలో బాగా అనుకూలంగా ఉండడం, రాశ్యధిపతి గురువు పంచమంలో, శుక్రుడు లాభ స్థానంలో ఉండడం వల్ల అతి తక్కువ ప్రయ త్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అప్రయత్నంగా ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో అతి తేలికగా ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా దూర ప్రాంతంలో ఒక ప్రతిష్ఠాత్మక కంపెనీలో ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి.
  8. మకరం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఈ ఏడాది చివరి లోగా ఈ రాశివారికి తప్పకుండా నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది. జీవితాంతం కొనసాగగల ఉద్యోగంలో, సరైన పదవి లభించడానికి వీలుగా గ్రహ సంచారం జరుగుతోంది. సాధారణంగా దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించడం జరుగుతుంది. ధనపరంగా, పదవి పరంగా అనుకూలమైన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది.