Horoscope Today: ఈ రాశి వారికి కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి.. అవసరమైన డబ్బులు అందుతాయి

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది..

Horoscope Today: ఈ రాశి వారికి కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి.. అవసరమైన డబ్బులు అందుతాయి
Follow us
Subhash Goud

|

Updated on: Sep 17, 2021 | 6:32 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. సెప్టెంబర్ 17(శుక్రవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:

కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి:

కీలక వ్యవహారాలలో జాగ్రత్తలు వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో పెద్దల సలహాలు తప్పనిసరి అవసరం. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మేలు జరుగుతుంది.

మిథన రాశి:

కొత్త పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు ప్రణాళికపై స్పష్ట వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.

కర్కాటక రాశి:

వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యమైన పనుల విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి:

మీమీ రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో బాగా ఆలోచించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.

కన్య రాశి:

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఓ వ్యవహారంలో డబ్బులు చేతికి అందుతాయి. కీలక సమాయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

తుల రాశి:

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి తగినట్లుగా డబ్బులు చేతికి అందుతాయి. ఇతరుల నుంచి సహాయం పొందుతారు.

వృశ్చిక రాశి:

ఉత్సాహంగా పని చేస్తారు. బంధువుల సహకారం అందుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు రాశి:

వృత్తి, ఉద్యోగులకు, వ్యాపారులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు.

మకర రాశి:

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి.

కుంభ రాశి:

చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

మీన రాశి:

పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు.

ఇవీ కూడా చదవండి: Chardham Yatra 2021: చార్‌ధామ్ యాత్ర చేయాలనుకునే వారికి శుభవార్త! నిషేధం ఎత్తివేసిన కోర్టు.. షరతులు వర్తిస్తాయి!

Bears Visit Temple: ఛత్తీస్‌ఘడ్ చండీ దేవాలయంలో అద్భుతం.. పూజారి గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తున్న ఎలుగుబంట్లు