Horoscope Today: ఈ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి.. ఉద్యోగాల్లో ఇబ్బందులు .. ఈరోజు రాశి ఫలాలు..

Rasi Phalalu On may 23rd 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే

Horoscope Today: ఈ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి.. ఉద్యోగాల్లో ఇబ్బందులు .. ఈరోజు రాశి ఫలాలు..
Horoscope Today
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2021 | 7:12 AM

Rasi Phalalu On may 23rd 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు ఆదివారం (మే 23న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి.. ఈరోజు వీరు చేపట్టే పనులు చాలా అనుకూలంగా సాగుతాయి. అంతేకాకుండా.. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి ఆరాధన శుభఫలితాలను కలుగజేస్తుంది.

వృషభ రాశి.. ఈరోజు వీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇబ్బందులు ఉంటాయి. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మిథున రాశి.. ఈరోజు వీరికి రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. వ్యక్తిగత కార్యక్రమాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పార్వతీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి.. ఈరోజు వీరికి స్నేహితులతో కొన్ని మాట పట్టింపులు ఏర్పడతాయి. అంతేకాకుండా అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మహాలక్ష్మీ ఆరాధన మేలు చేస్తుంది.

సింహ రాశి.. ఈరోజు వీరికి దూర ప్రాంతాల నుంచి కొన్ని వార్తలు అందుతుంటాయి. విలువైన వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శివ ఆరాధన మేలు చేస్తుంది.

కన్యరాశి.. ఈరోజు వీరికి వేరు వేరు రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి. దూర ప్రాంత ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తుంటారు. సుబ్రమణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

తులారాశి.. ఈరోజు వీరికి ఆలోచనలు పలు విధాలుగా అమలు పరిచే ప్రయత్నం చేస్తుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. పేదవారికి అన్నదానం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరు వ్యాపార ఉద్యోగాల విషయంలో చిన్న చిక్కులు ఎదుర్కోంటుంటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే క్రమంలో కొన్ని అప్పులు చేయవలసి ఉంటుంది. అలాగే వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు ఎదుర్కోంటుంటారు. సుదర్శన స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మకర రాశి.. ఈరోజు వీరు వ్యయప్రాయాసలకోర్చి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. శ్రీరాముని నామ స్మరణ మేలు చేస్తుంది.

కుంభరాశి.. ఈరోజు వీరికి ధార్మిక చింతన ఏర్పడుతుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. మహాలక్ష్మీ ఆరాధన మేలు చేస్తుంది.

మీన రాశి.. ఈరోజు వీరు ఉద్యోగాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రముఖుల సహాయ సహకారాలు అవసరం ఉంటాయి. లక్ష్మీ నరసింహ దర్శనం మేలు చేస్తుంది.

వీడియో..

Also Read: మీకు ఈ అలవాట్లు ఉంటే ఆర్థిక సమస్యలు తప్పవు.. గరుడ పురాణంలో ఉన్న విషయాలు ఏంటంటే..