Horoscope Today: పనులలో ఆటంకాలు కలుగుతాయి…ఈరోజు రాశి ఫలాలు..

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తమ రోజులో ఏం జరగబోతుందనేది

Horoscope Today: పనులలో ఆటంకాలు కలుగుతాయి...ఈరోజు రాశి ఫలాలు..
Horocope
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2021 | 6:43 AM

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తమ రోజులో ఏం జరగబోతుందనేది అంచనా వేస్తుంటారు. ఈ క్రమంలోనే రాశి ఫలాలు.. జాతకాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు అక్టోబర్ 27న బుధవారం నాడు చంద్రుడు కర్కాటకంలో సంచరించనున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయనేది తెలుసుకుందాం.

మేష రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.. శుభవార్తలు వింటారు. ఇతరులను విశ్వసించడంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి.. ఈరోజు వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటారు. దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. పనులను వాయిదా వేస్తారు. మిథున రాశి.. ఈరోజు వీరికి నూతన పరిచయాలు కలుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తగ్గుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో సమస్యలు తగ్గుతాయి. కర్కాటక రాశి.. ఈరోజు వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి.. పనిభారం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి.. ఈరోజు వీరు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు. స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. కన్య రాశి.. ఈరోజు వీరు నూతన విషయాలను తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సఫలం అవుతాయి. తుల రాశి.. ఈరోజు వీరు పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో పని భారం ఉంటుంది. వృశ్చిక రాశి.. ఈరోజు వీరు ఎక్కువగా అప్పులు చేస్తారు.. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. బాధ్యతలు పెరుగుతాయ. వ్యాపారాలలో నిరుత్సాహంగా ఉంటారు. ధనుస్సు రాశి.. ఈరోజు వీరు కుటంబంలో సానుకూలంగా ఉంటుంది. సేవ కార్యక్రమాల్లో పాల్గోంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో పని భారం ఉంటుంది. మకర రాశి.. ఈరోజు కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సానుకూలంగా ఉంటారు. కుంభ రాశి.. ఈరోజు వీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. మీన రాశి.. ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు జరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు జరుగుతాయి. దైవదర్శనాలు చేస్తారు.

Also Read: Manchu Manoj: ఇంతకీ ఆ తెల్ల పిల్ల ఎవరు.? తన రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మంచు మనోజ్‌..

Adipurush: సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేస్తోన్న ప్రభాస్‌.. తుది దశకు చేరుకుంటున్న ఆది పురుష్‌ చిత్రీకరణ..