Horoscope Today: ఆర్థిక వ్యవహారాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (October 01, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. మిథున రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (అక్టోబర్ 1, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగానే ఉండే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. మిథున రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం బాగానే ఉంటుంది. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఏ ప్రయత్నమైనా సానుకూలంగా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లా సంగా సాగిపోతుంది. స్నేహితుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ముఖ్యమైన ప్రయత్నాలు సజావుగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. తోబుట్టువులకు బాగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగు తాయి. ప్రభుత్వోద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపా రాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యయ ప్రయాసలు, తిప్పటలు ఎక్కువగా ఉంటాయి. కొందరు బంధు మిత్రు లకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహ కారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఆర్థిక విషయాలో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగి పోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలను తేలికగా పరిష్కరించుకుంటారు. ఆదాయం బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వ్యాపా రాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ముఖ్య మైన పనులు, ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. స్వల్ప అనారోగ్యాలు చికాకు పెడతాయి. కుటుంబపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. శ్రమ తిప్పట కూడా ఉంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పదోన్నతి లభించడానికి అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవ హారాలను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, ఊరట లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. అయితే, ఖర్చులు బాగా పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి, పని భారం ఉన్నప్పటికీ అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయవద్దు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలను అమలు చేస్తారు. ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందు కుంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కా రమవుతాయి. ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.