Horoscope Today: వీరికి అనవసరపు ఖర్చులు, డబ్బులు స్వాహా.. ఆదివారం రాశిఫలాలు ఇలా..

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థిక, ఆస్తి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి.  తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి.

Horoscope Today: వీరికి అనవసరపు ఖర్చులు, డబ్బులు స్వాహా.. ఆదివారం రాశిఫలాలు ఇలా..
Horoscope

Edited By: Ravi Kiran

Updated on: Nov 02, 2025 | 7:44 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం వల్ల వల్ల లాభపడతారు. ఉద్యోగంలో బాధ్య తలు బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం నిల కడగా ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆలయాల సందర్శన ఉంటుంది. కుటుంబంలో విలువ పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగిపోతాయి. సోదరుల సహాయంతో ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం నుంచి బయట పడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల రాకతో కుటుంబంలో ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. మంచి ఉద్యోగంలోకి మారేందుకు అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రయాణాల విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉన్నప్పటికీ బాధ్యతల భారం బాగా పెరుగుతుంది. ఆక స్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బంధు వులతో అపార్థాలు తలెత్తుతాయి. కొందరు మిత్రుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపా రాలు కొద్దిగా నిదానంగా సాగుతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా సాగిపోతాయి. డబ్బు జాగ్రత్త.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. సహచరులకు బాధ్యతల నిర్వహణలో సహాయ పడతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యో గాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. చిన్ననాటి మిత్రు లను కలుసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో సరిపెట్టుకో వాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడు పుతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపి స్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రు లతో ఎంజాయ్ చేస్తారు. ఇంటికి బంధువులు వచ్చే సూచనలున్నాయి. కుటుంబంలో ఉత్సాహ భరిత వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్య మైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం. కొన్ని ముఖ్య మైన పనులు అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవు తాయి. వృత్తి, వ్యాపారాల వారికి కలిసి వస్తుంది. రాజకీయాలు, సామాజిక సేవ, రియల్ ఎస్టేట్ వంటి రంగాల వారు ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ జీవి తంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులతో సత్పంబం ధాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. వివాహ ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం, ఉద్యోగం, ఆరోగ్యం వంటి అంశాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవు తాయి. గృహ నిర్మాణ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగు తాయి. ముఖ్యమైన వ్యక్తిగత పనుల్నిసకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రులకు అవసరానికి సహాయపడతారు. స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థిక, ఆస్తి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి.  తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో సహచరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలన పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోయి సామరస్యం ఏర్పడుతుంది. కుటుంబపరంగా కూడా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు, అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంది.