AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ketu Blessings: కేతువు అనుగ్రహం.. వీరికి జీవితంలో ఆకస్మిక శుభ ఫలితాలు..!

Ketu Transit 2026: సింహ రాశిలో సంచరిస్తున్న కేతువు తన సొంత నక్షత్రం మఖలో ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి అనుకోని శుభఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ketu Blessings: కేతువు అనుగ్రహం.. వీరికి జీవితంలో ఆకస్మిక శుభ ఫలితాలు..!
Ketu Blessings
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2026 | 5:59 PM

Share

ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తున్న కేతువు తన సొంత నక్షత్రమైన మఖలో ప్రవేశించడం జరిగింది. డిసెంబర్ 5 వరకు కేతువుకు దీనివల్ల మరింత బలం పెరిగింది. సాధారణంగా ఏ రాశి వారికీ మేలు చేయని ఈ పాప గ్రహం తన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని రాశులకు మేలు చేయడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కేతువు వల్ల సమస్యలు ఎదుర్కునేవారు నిత్యం స్కంద స్తోత్రం లేదా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

  1. మేషం: ఈ రాశివారికి పంచమ స్థానంలో సంచరిస్తున్న కేతువు వల్ల ఈ రాశివారి జీవితంలో ముఖ్యమైన శుభపరిణామాలు చేసుకుంటాయి. ఆకస్మిక పదోన్నతులకు, ఆకస్మిక శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా సమర్థతకు, ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
  2. మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు మఖా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల జీవితంలో అనేక రకాలుగా వృద్ధి, అభివృద్ది చోటు చేసుకుంటాయి. సాధారణంగా ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన అభివృద్ధి సాధ్యమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
  3. సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. సామాన్యుడు సైతం సంపన్నుడు కావడం జరుగుతుంది. అనుకోని మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు, షేర్ల వల్ల కూడా ఆదాయ వృద్ధి జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వారసత్వ ఆస్తి సంక్రమిస్తుంది.
  4. తుల: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కేతువు మఖా నక్షత్ర ప్రవేశం వల్ల జీవితం అనేక విధాలుగా పురోగతి చెందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి నవమ స్థానంలో ఉన్న కేతువుకు సొంత నక్షత్ర ప్రవేశంతో బలం పెరిగినందు వల్ల విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. వ్యాపారాల దశ, దిశ మారిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఒకటి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే సూచనలున్నాయి.
  6. మీనం: ఈ రాశివారికి షష్ట స్థానంలో కేతువు మఖా నక్షత్ర ప్రవేశం వల్ల కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందడం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us