AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. బుధవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి, గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర రాశుల వారికి కూడా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం పరంగా భిన్న ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. బుధవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 7:58 AM

Share

దిన ఫలాలు (జూలై 15, 2026): మేషం రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడడం ఎక్కువ అవుతుంది. వృషభం రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సహచరుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిథునం రాశి వారికి వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అలాగే ఇతర రాశుల వారికి కూడా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం పరంగా భిన్న ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని, ముఖ్యమైన నిర్ణయాలను ఆచితూచి తీసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడడం ఎక్కువ అవుతుంది. వృత్తి నిపుణులు ఆశించినదాని కంటే ఎక్కువగా రాణిస్తారు. ఆశించిన ప్రాధాన్యం, గుర్తింపు సంపాదించుకుంటారు. ఆదాయం గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. విలాస జీవితం మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సహచరుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవస రం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా వాగ్దానాలు చేయకపోవడంమంచిది. తల్లితండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహచరుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల వంటి వృత్తి రంగాలవారికి డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా కొనసాగుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి శుభవార్త అందుతుంది. నిరుద్యోగు లకు కాలం కలిసి వస్తుంది. ఆశించిన సంస్థ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో మార్పు ఉండకపోవచ్చు. ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు సకాలంలో సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఉద్యోగంలో కూడా కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి. ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించడం జరుగుతుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. బంధువులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా సంపాదన నిల కడగా వృద్ది చెందుతుంది. ఉద్యోగం మారదలచుకున్న పక్షంలో అందుకు ఇది చాలావరకు అను కూలమైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరో గ్యానికి లోటుండదు. కుటుంబంతో ఇష్టమైన ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి రంగంలో ఉన్నవారి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెంచాలని లేదా వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచన చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )

ఉద్యోగంలో కొద్దిగా పనిభారం పెరిగే అవకాశం ఉంది. సహచరుల బాధ్యతల్ని పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా పెరుగుతుంది. వ్యాపారులకు కొద్దిగా రాబడి వృద్ధి చెందుతుంది. ఆదాయం నిలకడగానే ఉన్నప్పటికీ, అనుకోని ఖర్చులు తప్పనిసరి అవుతాయి. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితిలో తప్పకుండా పురోగతి కనిపిస్తుంది. ఇతరులకు సహాయపడగల స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇష్ట కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు తేలి కగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే అవ కాశం ఉంది. ప్రత్యేక బాధ్యతలతో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకో కుండా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. చిన్నపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా సఫలమవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆహార, విహార సంబంధమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి, తిప్పట కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ పనులు మీద వేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగంలో కూడా పనిభారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపా రాలు యథావిధిగా కొనసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. కొందరు స్నేహితుల వల్ల బాగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.

Follow Us