Horoscope Today(03 July): ఈ రాశివారు ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Daily Horoscope(03rd July): జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. జ్యోతిష్యం ఆధారంగా రోజును ప్రారంభిస్తుంటారు. మరి ఈ క్రమంలోనే సోమవారం 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.? ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

Horoscope Today(03 July): ఈ రాశివారు ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 03, 2023 | 5:23 PM

Daily Horoscope(03rd July): జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. జ్యోతిష్యం ఆధారంగా రోజును ప్రారంభిస్తుంటారు. మరి ఈ క్రమంలోనే సోమవారం 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.? ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాలు పరవాలేదనిపిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబంలో ఒకటి రెండు చికాకులు చోటు చేసుకుంటాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఆఫర్ వస్తుంది. కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపు ణులకు ఇది కలిసి వచ్చే సమయం. చిన్న చిన్న ప్రయత్నాలు సైతం సఫలం అవుతాయి. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. స్నేహితుల మీద మరీ ఎక్కువగా నమ్మకం ఉంచకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చిన్నపాటి అదృష్టం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యో గాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభవార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తి అవుతాయి. చిన్ననాటి స్నేహితులు కలుసు కుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అష్టమ శని కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్ప టికీ, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కుటుం బంలో ఆనందోత్సాహాలు చోటుచేసుకుంటాయి. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ పరంగా టెన్షన్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేయవలసి వస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసు కోవద్దు. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కొంతకాలం పాటు వాగ్దానాలు చేయటం, హామీలు ఉండటం శ్రేయ స్కరం కాదు. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి, జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా తప్పకుండా శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సలహాలు సూచనలు అధికారు లకు నచ్చు తాయి. బంధుమిత్రులలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ జీవితం ఆనందంగా సాగిపోతుంది. సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు కూడా హ్యాపీగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. స్నేహి తులతో విందులు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ విషయాలలో శ్రద్ధ చూపించడం మంచిది. ఆరోగ్యానికి లోటు ఉండదు. కొందరు స్నేహితులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవు తుంది. కొందరు స్నేహితులకు అండగా నిలబడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఆదాయంలో తప్పకుండా పెరుగుదల ఉంటుంది. ఇతరులకు సహాయపడే స్థితికి చేరుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో బాగా ఒత్తిడి జరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో, వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సొంత విషయాలు లేదా వ్యక్తిగత విషయాలు బయట పెట్టకపోవడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. రోజంతా సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉద్యోగ జీవితం గౌరవంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం క్లిక్ చేయండి..