
దిన ఫలాలు (జనవరి 11, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉండే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సకాలంలో, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. వృత్తి జీవితం లాభసాటిగా పురోగమిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ముఖ్యమైన పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండవచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో హోదాతో పాటు బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పెండింగ్ పనుల్ని పూర్తి చేయడం మంచిది. ఇతరుల బాధ్యతల్ని తలకెత్తుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయానికి లోటుండదు.
ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలకు అవకాశం ఉంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. మిత్రుల సహాయ సహకారాలతో ఒకటి రెండు వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు సంతృప్తికరంగా పరిష్కారం అవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. కొందరు మిత్రులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కొన్ని పనుల్ని పూర్తిచేయడంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కోపతాపాలను తగ్గించుకోవడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. రావలసిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు తిరుగుండదు. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేయడం, కొందరికి ధన సహాయం చేయడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
ఉద్యోగ జీవితం బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు అనుకోకుండా అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సాయం చేయాల్సి వస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. కెరీర్ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. బంధుమిత్రుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లో సఫలం అవుతారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శించడం జరుగుతుంది.
ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఒక శుభ కార్యంలో దూరపు బంధువుల్ని కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. సోదరులతో కొన్ని వివాదాలు, విభేదాలు పరిష్కారం అవుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహాలతో పాటు బరువు బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. ఆహార, విహారాల్లో, ప్రయాణాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.
ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొంత ఆలస్యంగానైనా అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన విశేషాలు వింటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.