మేషం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇచ్చిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక లాభం ఉంది. వ్యాపారంలోనూ ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం పఠిస్తే మంచిది.
వృషభం
చేపట్టిన పనుల్లో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీదేవిని దర్శించుకోవాలి.
మిథునం
కీలక వ్యవహారాలు, పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులు మీ పనితీరుపై అసంతృప్తి చెందుతారు. అస్థిర నిర్ణయాలతో ఇబ్బంది పెడతారు. కలహాలు, గొడవలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు చేకూరుతుంది.
కర్కాటకం
ఈ రాశుల వారు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువలను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
సింహం
కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు లాభిస్తాయి. పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల శుభం కలుగుతుంది.
కన్య
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. ఇష్టదేవతలను ఆరాధిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
తుల
వృత్తి, ఉద్యోగ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మరింత ఉత్సాహంగా ముందుకు వెళతారు. కొన్ని విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. దుర్గాధ్యానం ఉత్తమ ఫలితాల పొందుతారు.
వృశ్చికం
చేపట్టిన పనులు సులువుగా పూర్తవుతాయి. ఉన్నతాధికారుల సహాయం అందుతుంది. అధికారుల సాయంతో కీలక పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య భగవానుడిని ఆరాధిస్తే మేలు చేకూరుతుంది.
ధనస్సు
విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులు, స్నేహితులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆదిత్యహృదయ స్తోత్రం పఠించడం మంచిది.
మకరం
దైవ బలంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అనుభవజ్ఞులను కలుస్తారు. ఫలితం కూడా అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం లాభిస్తుంది. శని ధ్యానం శుభదాయకం.
కుంభం
కీలక వ్యవహారాల్లో పెద్దల ఆశీస్సులు లాభిస్తాయి. మీ పనితీరుపై ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారు. బంధువులు, స్నేహితులను కలుస్తారు. చంద్ర ధ్యానం పఠించడం వలన శుభం కలుగుతుంది.
మీనం
శ్రమాధిక్యం పెరుగుతుంది. కీలక పనులు, వ్యవహారాల్లో ఆత్మీయుల సహాయ సహకారం మేలు చేస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.