Horoscope Today: వీరు కొత్త వస్తువులు కొంటారు.. వ్యాపారంలో లాభాలు పొందుతారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

|

Nov 01, 2022 | 6:31 AM

ఈరాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కుటుంబీకులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.

Horoscope Today: వీరు కొత్త వస్తువులు కొంటారు.. వ్యాపారంలో లాభాలు పొందుతారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope
Follow us on

మేషం

కీలక వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. కొన్ని విషయాలు మానసిక ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబీకులు, బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేస్తే మరింత మేలు చేకూరుతుంది.

వృషభం

ఇవి కూడా చదవండి

బంధు, మిత్రులను కలుసుకుంటారు. సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. పలువురి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు లాభిన్నిస్తాయి. గణపతి దేవుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

మిథునం

ఈ రాశివారు ఒక శుభవార్త వింటారు. అధికారులు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని దర్శించుకుంటే మంచిది.

కర్కాటకం

వీరు సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల పరిణామాలు సంభవిస్తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల ఆశీర్వచనాలు, సలహాలు రక్షిస్తాయి. మహాలక్ష్మి దర్శించుకుంటే అనుకూల ఫలితాలు పొందుతారు.

సింహం

విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబీకులు, బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం లాభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన మాత్రం మరవద్దు.

కన్య

సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ముందుచూపుతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో అభిప్రాయబేధాలు రానీయకండి. కొందరితో అభిప్రాయ భేదాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే మంచిది.

తుల

చేపట్టిన పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన మనసుకు బాధ కలిగిస్తుంది. అవకాశాల విషయంలో నిరాశా నిస్పృహలు కలుగుతాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవతో సమస్యలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం

ఈరాశివారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగం విషయంలో అధికారుల మెప్పు పొందుతారు. విరోధులపై మీదే పైచేయి అవుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. హనుమంతుడిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.

ధనస్సు

ఈరాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కుటుంబీకులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.

మకరం

చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కొన్ని విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. శ్రమాధిక్యం తప్పదు. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

కుంభం

వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో మొహమాటం, దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఉత్తమం.

మీనం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తువులను కొంటారు. బంధువులతో కలహ సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మీ గణపతి ఆరాధనతో శుభం కలుగుతుంది.