
దిన ఫలాలు (డిసెంబర్ 30, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. అవసర విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరిగే అవకాశముంది. వ్యాపారాల నిర్వహణలో మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది.
ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. రావలసిన డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. చిన్నా చితకా ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. మిత్రులకు సంబంధించిన శుభకార్యంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం బాగా పెరుగుతుంది. కొందరు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశముంది. దగ్గర బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, అనుకూలంగా సాగుతుంది.
ఉద్యోగంలో మీ హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొందరు బంధువులతో సామరస్యం పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి ఇది సమయం కాదు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాలు నిర్వహిస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల పరిస్థితి కూడా మెరుగ్గా, ఆశాజనకంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు కొన్ని కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆదాయానికి కొరత ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా పూర్తి స్థాయిలో ఫలిస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొద్దిగా శ్రమ పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు సమయానికి చేతికి అంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా, ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాలను తీసుకువస్తాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని చాలా వరకు పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం బాగా హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
వ్యాపార వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. లాభాలు బాగా పెరుగుతాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పుల చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బాధ్యతలు మారే అవకాశం ఉంది. చేపట్టిన ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇష్టమైన బంధు మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. సోదరులతో ఆస్తి, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు బంధువుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలపరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అన్ని రంగాలకు చెందినవారికి సమయం కాస్తంత ప్రోత్సాహకరంగా ఉంది. ఆదాయం కొద్దిగా వృద్ది చెందుతుంది. ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు.