Daily Horoscope(July 28): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? జూలై 28, 2023న మేషం, సింహం, కన్యారాశి, మకరం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుంచి అవసర సమయాల్లో సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉండే అవకాశముంది. బంధు మిత్రు లతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. మొండి బాకీలను వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో కాస్తంత పట్టు విడుపులతో వ్యహరించడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇంటా బయటా ఒత్తిడి ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో వైద్యులతో సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు స్థాన చలనంతో కూడిన ప్రమోషన్ రావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ప్రయాణాల వల్ల ఫలితం ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెడతారు. వృత్తి జీవితంలో సరికొత్త వ్యూహాలను అనుసరిస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులు ఎటువంటి అవరోధాలూ లేకుండా సకాలంలో పూర్తవుతాయి. తోబుట్టువులతో వివాదాలు ఏవైనా ఉంటే సమసిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి తగ్గి, సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన శుభవార్త అందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కొన్ని వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరగ కుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుని అమలులో పెడతారు. ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను, లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొందరు సహచరుల కారణంగా ఉద్యోగంలో మాట పడాల్సి వస్తుంది. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇతరుల వాద వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా మీ నిర్ణయాలు అందరికీ నచ్చేవిగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సలహాలను, సూచనలను కూడా తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాల బాట పడతారు. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులను నమ్మి డబ్బు నష్ట పోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వ్యాపారాల పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రముఖులతో స్నేహాల వల్ల కొన్ని ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆదాయ మార్గాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. డబ్బు ఇవ్వడం కానీ, డబ్బు తీసుకోవడం గానీ చేయవద్దు. స్నేహితుల నుంచి అవసరమైన సహాయం అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో ప్రత్యేకమైన బాధ్యతలు మీద పడతాయి. ఇందుకు సరైన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపా రంలో భాగస్థులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి రంగంలో ఉన్నవారికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా, ఆశాజన కంగా ఉంటాయి. బంధు వర్గంతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలుం టాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగులు ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో కూడా ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఇంట్లో అనుకూల పరిస్థితులుంటాయి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. సరికొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. ఆస్తి సంబంధంగా చేతికి డబ్బు అందుతుంది. సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారితో పరి చయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఉత్సాహంతో పనిచేసి లాభాలు అందుకుం టారు. శుభకార్యంలో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అధికార లాభంతో పాటు ఆదాయ లాభం కూడా కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తుల్లో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ప్రయ త్నాలు చేపడతారు. గృహ, వాహన సంబంధమైన ఆటంకాలు తొలగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి