
దిన ఫలాలు (ఆగస్టు 12, 2025): మేష రాశి వారు ఈ రోజు కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడితే తప్పకుండా సత్ఫలితాలు పొందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా బాధ్యతలు పెరుగే అవకాశముంది. మిథున రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనివ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడితే తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో ఒక ముఖ్య మైన శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోతాయి. ఉద్యోగంలో అనేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. రావలసిన సొమ్ము సమయానికి చేతికి అందకపోవచ్చు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా పురోగతి సాధిస్తారు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.
రావలసిన డబ్బు రావడంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనివ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గిపోతాయి. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సాను కూలతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లబి స్తాయి.
ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఇంటా బయటా కొద్దిగా పనిభారం, పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి దూరపు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో పనిభారం ఉన్నా ఆశించిన ఫలితం ఉంటుంది.
ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్య తలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. దగ్గర బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలని స్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో అభివృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.
ఆదాయపరంగా అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. సమయం బాగా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని, మంచి కార్యక్రమాలను రూపొందుకుని ఆచరణలో పెట్టడం మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతమవుతాయి. వ్యాపారాల్ని విస్తరించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. చేపట్టిన ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ విషయాలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పెరగవచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు బాగా తగ్గి ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. అత్యవసర వ్యవహారాలు, పనులు సకాలంలో సంతృప్తికరంగా ముగుస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఆస్తి వివా దాన్ని రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు.
ఒకటి రెండు ఆశలు, కోరికలు నెరవేరే అవకాశం ఉంది. జీత భత్యాలు, అదనపు ఆదాయ మార్గాల పరంగా శుభవార్తలు వింటారు. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభాలు గడించడం జరుగుతుంది.
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడ తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యక్తి గత, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఒకరి ద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం పరవాలేదు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువగానూ, ఫలితం ఎక్కువగానూ ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తొందరపడి ఎవరికీ ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.