Horoscope Today: వీరికి అంతా శుభమే.. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Jun 28, 2022 | 5:47 AM

Horoscope Today (28-06-2022): చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వారి రాశి ఫలాలను బట్టి ఆరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

Horoscope Today: వీరికి అంతా శుభమే.. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

Horoscope Today (28-06-2022): చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వారి రాశి ఫలాలను బట్టి ఆరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మంచిముహూర్తాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జూన్‌ 28 (మంగళవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం
వీరికి శుభకాలం నడుస్తోంది. ఇష్టమైనవారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించడం ఉత్తమం. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

వృషభం
వీరికి మిశ్రమకాలం. ఆశించిన ఫలితాలు రాబట్టాలంటే శ్రమాధిక్యం. అధికారుల సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం, ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం మేలు చేకూరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథునం
పట్టుదల కోల్పోకూడదు. ఉద్యోగంలో సానుకూల ఫలితాలున్నాయి. తోటివారి సహకారం లాభిస్తుంది. ఇష్ట దైవధ్యానంతో ఇబ్బందుల నుంచి బయటపడతారు.

కర్కాటకం
చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదువుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుర్గ దేవిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది.

సింహం
వీరికి శుభ కాలం. ఆయా రంగాల్లో సానుకూల ఫలితాలను అందుకుంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయాలు అనుకూలంగా వస్తాయి. ఈశ్వరుడిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.

కన్య
సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్టమైనవారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలు గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థనతో సానుకూల ఫలితాలు పొందుతారు.

తుల
ఈ రాశివారికి మిశ్రమకాలం. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసం, మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఇష్ట దైవారాధన మాత్రం మానవద్దు.

వృశ్చికం
వీరికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టే పనుల్లో శ్రమ అధికమవుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడతారు. అవకాశాలు కోల్పోతారు. శనిధ్యాన శ్లోకం పఠిస్తే శుభం కలుగుతుంది.

ధనస్సు
బుద్ధిబలం తోడుగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతారు. కీలక వ్యవహరాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. దుర్గాస్తుతి చేయడం వల్ల అనుకూల ఫలితాలు అందుకుంటారు.

మకరం
వీరికి మిశ్రమ ఫలితాలున్నాయి. కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివారాధన మేలు చేకూరుస్తుంది.

కుంభం
వీరికి అంతా శుభమే జరుగుతుంది. తోటివారితో సంతోషంగా గడుపుతారు. కుటుంబం సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలు పొందుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీనం
చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారములో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన కుటుంబ సభ్యుల సహకారం మేలు చేకూరుస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి