Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారికి బంధుమిత్రుల నుంచి సాయం.. శుక్రవారం రాశి ఫలాలు..

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో పలుమార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే

Horoscope Today: ఆ రాశుల వారికి బంధుమిత్రుల నుంచి సాయం.. శుక్రవారం రాశి ఫలాలు..
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2021 | 6:59 AM

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో పలుమార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టిసారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 5న ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

వృషభరాశి: ఈ రాశివారు ఒక శుభవార్తను అందుకుంటారు. మనోధైర్యంతో ముందడుగు వేస్తే.. విజయం వరిస్తుంది. అవసరానికి బంధుమిత్రుల నుంచి సాయం అందుకుంటారు.

మిథున రాశి: ఈ రాశివారికి మిశ్రమకాలం. ఇబ్బందులు, ఒత్తిడి పెరగినా.. మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. అవసరానికి సహాయం అందుతుంది. బంధుమిత్రలతో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశముంది. జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

సింహ రాశి: ఈ రాశి వారు ఒక శుభవార్తను అందుకుంటారు. మానసిక ప్రశాంతతకు భంగం కలగకుండా ముందుకుసాగాలి. పెద్దలను, బంధుమిత్రులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

కన్య రాశి: ఈ రోజు చేపట్టే పనుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలను అధిగమించవచ్చు. భవిష్యత్తును అనుసరించి ముందడుగు వేయాలి. ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది.

తుల రాశి: ఈ రాశి వారు కాలానుగుణంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. కొన్ని పనుల్లో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చిక రాశి: చేపట్టిన పనుల్లో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. శారీరక శ్రమ పెరిగినప్పటికీ.. ధైర్యంతో ముందుకుసాగాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వాదనలు మానుకుంటే మంచిది.

ధనుస్సు రాశి: ఈ రాశివారు చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకుంటే మంచిది.

మకర రాశి: ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కుంభరాశి: ఈ రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు పూర్తయ్యేందుకు కొంచెం ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శ్రమకు తగిన గుర్తింపు కోసం కష్టపడాల్సి వస్తుంది.

మీన రాశి: ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఈ రాశి వారు మనోధైర్యంతో సాగాలి. మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అందరినీ కలుపుకొనిపోవడం మంచిది. గొడవలకు దూరంగా ఉండాలి.

Also Read:

Indian Railway: రైళ్లు నిత్యం తిరిగే దూరం ఎంత..? దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు.. ఎన్నో ఆసక్తికర విషయాలు..!

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రోజు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే..

Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట