AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..!

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..!
Subhash Goud
|

Updated on: Nov 06, 2021 | 4:56 AM

Share

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్‌ 6)న శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారికి ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి సలహాలు, సూచనలు పొందుతారు.

వృషభ రాశి: కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పనులు చేపట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

మిథున రాశి: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. అధిక శ్రమ తప్పదు. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

కర్కాటక రాశి: ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో మంచి ఫలితాలు అందుకుంటారు.

సింహ రాశి: శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

కన్య రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పనిలో శ్రమ పెరిగినా.. ధైర్యంతో ముందుకెళ్లి విజయం సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.

తుల రాశి: వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఆశించిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు తప్పవు. పెద్దల నుంచి సలహాలు పొందుతారు. కాస్త శ్రమ పెరుగుతుంది.

వృశ్చిక రాశి: మంచి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.

ధనుస్సు రాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కీలక వ్యవహారాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

మకర రాశి: చేపట్టిన పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇతరులు చెప్పిన మాటలు వినకపోవడం మంచిది.

కుంభ రాశి: బంధువుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఏ పని చేపట్టినా ధైర్యంతో ముందుకెళితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి: ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి. కీలక విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.

ఇవి కూడా చదవండి:

Ayyappa Deeksha: అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి..? ప్రారంభమైన మాలాధరణలు.. దీక్ష నియమ నిబంధనలు..!

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయ దర్శన భాగ్యం భక్తులకు ఎప్పటి నుంచంటే..?

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?