జోతిష్యాశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు వారి రాశి చక్రం పై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈరోజు శనివారం.. మార్చి 5న రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి..
వీరు ఈరోజు అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబసభ్యులు.. స్నేహితుల మద్ధతు లభిస్తుంది.
వృషభరాశి..
ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దైవ దర్శనాలు చేసుకుంటారు. స్నేహితులు.. బంధువుల సహాయసహకారాలు లభిస్తాయి.
మిథున రాశి..
వీరు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. కొత్తగా పనులను ప్రారంభిస్తారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనవసర భయాందోళనకు గురవుతారు.
కర్కాటక రాశి..
వీరు ఈరోజు ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్తగా వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
సింహా రాశి..
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. రుణ బాధలు తొలగిపోతాయి.
కన్య రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. అలాగే విందులు, వినోదాల్లో పాల్గోంటారు.
తుల రాశి..
ఈరోజు వీరికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంఘంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి తోటివారికి విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఆకస్మిక ధననష్టం అవకాశాలు ఉంటాయి. మనస్తాపానికి గురవుతుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో ఆసక్తి తక్కువగా ఉంటుంది.
ధనుస్సు రాశి..
వీరికి ఈరోజు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అన్ని రంగాల్లోని వారికి మేలు జరుగుతుంది. స్త్రీలు సంతోషంగా ఉంటారు.
మకర రాశి..
ఈరోజు వీరికి దైవ దర్శనాలు పెరుగుతాయి. కుటుంబసౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు.
కుంభ రాశి..
ఈరోజు వీరికి మానసిక ఆనందాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వాయిదా పనులను పూర్తి చేస్తారు. కొత్తవారిని కలుసుకుంటారు. బంధుమిత్రులతో.. స్నేహితులతో విరోధం ఏర్పడుతుంది.
మీన రాశి..
ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.