దిన ఫలాలు (మే 28, 2024): మేష రాశికి చెందిన వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి ఆర్థికపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. పదోన్నతికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపు తారు. చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. నిరుద్యోగుల ప్రయ త్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభ కార్యంలో పాల్గొంటారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శత్రు బాధ, పోటీదార్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యో గంలో కొత్త బాధ్యతలతో పాటు కొత్త అవకాశాలు కూడా అందుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఖర్చులు కూడా బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, కొద్దిగా మోసపోయే అవ కాశం కూడా ఉంది. ప్రయాణాల్లో శ్రమాధిక్యత ఉండవచ్చు. ఉద్యోగ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఇంటా బయటా అదనపు బాధ్యతలు పెరిగి విశ్రాంతి కరవవుతుంది. అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. రావలసిన సొమ్ము చేతికి అందకపోవడంతో కొద్దిగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా మాత్రమే పెరుగుతాయి. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది కానీ, స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు శుభవార్తలతో పాటు దుర్వార్తలు కూడా వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడానికి మార్గాలు సుగమం అవుతాయి. ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్థికంగా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు. పెండింగ్ పనులు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా నిరాశ తప్పకపోవచ్చు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఎవరికీ హామీలు చేయకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరిగి, మరింత ఉత్సాహంగా పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అప్ర యత్న కార్యసిద్ధి ఉంటుంది. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కొందరు బంధుమిత్రుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులు కాస్తంత ఓర్పుతో ప్రయత్నాలు చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అవ సరం. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. కుటుంబ సభ్యుల తీరు ఇబ్బంది కలిగి స్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయో గించుకునే ప్రమాదం ఉంది. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల, చేపట్టిన ప్రయత్నాల వల్ల ఎంతో లాభం ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, ఊరట చెందుతారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరించాలనే ఆలోచన చేస్తారు. వృత్తి, ఉద్యో గాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థికపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. రావల సిన డబ్బు చేతికి అంది ఊరట చెందుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కీలక సమస్యల్ని అధిగమించి లాభాలు అందుకుంటారు. వ్యాపారంలో మార్పులు చేపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలని స్తాయి. ప్రయాణాల వల్ల పెద్దగా లాభం ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆలయా లను సందర్శిస్తారు. ఉద్యోగాల్లో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపా రాలు నష్టాల నుంచి కొద్దిగా బయటపడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంతో కష్టపడి స్వల్ప ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో కొద్దిపాటి ఒడిదుడుకులున్నప్పటికీ, లాభాల్లో కొద్దిగా పెరుగుదల ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పకపోవచ్చు. కుటుంబ జీవితం చాలావరకు ఉత్సాహంగా సాగిపోతుంది.