Horoscope 23rd June 2023
Rashi Phalalu (23 June 2023): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరగబోతోందో.. ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇవాళ ఆయా రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? 12 రాశుల వారి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్న వారికి శుభవార్త అందు తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు చక్కబడు తుంది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. స్నేహితుల సహాయంతో ప్రధానమైన పనులు పూర్తి అవుతాయి. డాక్టర్లు, లాయర్లు బిజీ అవుతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. శుభవార్త వింటారు.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరు ద్యోగులకు మంచి ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు సాను కూలపడతాయి. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటి నిపుణులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వాగ్దానాలు హామీలకు ప్రస్తుతానికి దూరంగా ఉండటం మంచిది.మిథు
- మిధునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాల వల్ల ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. నిరుద్యోగులు ఒడ్డున పడతారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితుల్లో పురోగతి కనిపిస్తుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారు, చిన్న వ్యాపారులు అభి వృద్ధి చెందుతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో అధికారులతో గానీ, సహచరులతో గానీ మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా సంయమనంతో వ్యవహరించడం మంచిది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపో తాయి. కుటుంబ జీవితంలో ప్రశాంతత ఏర్పడు తుంది. దైవ కార్యాలలో నిమగ్నం అవుతారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లల సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత జీవితం మంచి మలుపు తీసుకుంటుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగ జీవితంలో పని భారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇంట్లో ఈగల మోత బయట పల్లకీలు మోత అన్నట్టుగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపారంలో లాభాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మాట పట్టింపులకు, అనవసర పేచీలకు అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విలాసాల మీద, ప్రేమ వ్యవహారాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొందరు మిత్రులకు సహాయం చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిపాటి మెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇతరులకు సహాయం చేయడం, వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం వంటి ఆలోచనలను దూరంగా పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి రంగంలోని వారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా మారుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తి కావడం జరుగుతుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులకు ఏమాత్రం లోటు ఉండదు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిలకడగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సమయం. జీవితం పురోగతి దిశగా వెళుతోంది. వీలైనంత పాజిటివ్ గా వ్యవహరించడం మంచిది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): అనుకోకుండా ఒక శుభవార్త వినడం జరుగు తుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుం టాయి. అధికారులు బాగా ప్రోత్సహించడం జరుగుతుంది. వృత్తి జీవితంలోని వారికి క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వైద్య ఖర్చులు తగ్గుముఖం పడతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంతవరకు సఫలం అవుతాయి. ఉద్యోగ పరంగా పని భారం పెరిగే సూచనలు ఉన్నాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు పురోగతి చెందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం పెరగటం జరుగుతుంది. ప్రయాణాలలో డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వితరణ లేదా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ఒకటి రెండు చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చాలావరకు సాఫీగా సాగిపోతాయి.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..