Horoscope Today: వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Jun 22, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 22, 2024): మేష రాశి వారికి ఈ రోజు వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశికి చెందిన వ్యాపారులకు రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
Horoscope Today 22nd June 2024
Follow us on

దిన ఫలాలు (జూన్ 22, 2024): మేష రాశి వారికి ఈ రోజు వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశికి చెందిన వ్యాపారులకు రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబం మీద ఖర్చు ఎక్కువగా పెడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఇష్ట మైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యానికి లోటుండదు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. బంధువుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. మొండి బాకీలు వసూలవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. గృహ సౌకర్యం కోసం ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదా యంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలు పంచుకోవడం జరుగుతుంది. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వ్యవహారంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసు కోవడం మంచిది. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అధికారులతో సామరస్యంగా గడిచిపోతుంది. ఒత్తిడి, శ్రమ బాగా అవకాశం కూడా ఉంది. వృత్తి, వృత్తి జీవితం ఆశించిన విధంగా సాగిపోతుంది. వ్యాపారులకు రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. రాజీమార్గంలో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. కొద్దిపాటి వ్యయంతో ముఖ్య మైన వ్యవహారాలు పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండకపోవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేస్తారు. వృత్తి జీవితానికి గుర్తింపు లభించి డిమాండ్ పెరు గుతుంది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకుని ఆర్థిక సమ స్యలను పరిష్కరించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాటంకంగా పూర్తవుతాయి. మిత్రుల వల్ల డబ్బు వృథా అవుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆఫర్లు అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

నిరుద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధార పడడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అతి కష్టం మీద కొన్ని మాత్రమే పూర్తవుతాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు తలపెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆశిం చిన ఫలితాలనిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలపరంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జీత భత్యాలకు సంబంధించి అనుకూల వార్తలు వింటారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆస్తి వివాదాలు రాజీ మార్గంలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ప్రాధాన్యం పెరు గుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధపెడతాయి. ఇంటా బయటా పనిభారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆల యాల దర్శనం చేసుకుంటారు. తలపెట్టిన పనుల్లో కొద్దిగా ఇబ్బందులుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో తల్లితండ్రుల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలనిస్తాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఒకటి రెండు కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పనితీరుతో అధికారు లను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంటా బయటా బాధ్యతలు పెరిగి, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవ హారాలతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు స్వల్ప లాభాలతో సాగిపోతాయి. ఉద్యోగ వాతా వరణం సాదా సీదాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రుల్ని, ఇష్టమైన బంధువుల్ని కలుసుకుం టారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఒకరిద్దరు స్నేహితులు ఇబ్బంది పెడతారు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు సునాయా సంగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. కొందరు మిత్రులు తప్పు దోవ పట్టించే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి జీవి తంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా సునా యాసంగా పూర్తవుతుంది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఇంటా బయటా పలుకుబడి పెరు గుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారంలో దూసుకుపోతారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి బాగా తగ్గుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందు తుంది. వ్యక్తిగత సమస్యకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.