Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖంపడుతాయి.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు
దిన ఫలాలు (ఫిబ్రవరి 22, 2024): మేష రాశికి చెందిన వ్యాపారాలకు ఈ రోజు అనుకూల పరిస్థితులుంటాయి. వృషభ రాశి వారికి కెరీర్ సంబంధమైన విషయాలన్నీ సానుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (ఫిబ్రవరి 22, 2024): మేష రాశికి చెందిన వ్యాపారాలకు ఈ రోజు అనుకూల పరిస్థితులుంటాయి. వృషభ రాశి వారికి కెరీర్ సంబంధమైన విషయాలన్నీ సానుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శనీశ్వరుడితో పాటు మూడు సహజ శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థికపరమైన అంశాలు పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులుంటాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థికపరమైన చిక్కులు, సమస్యలు తొల గిపోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ స్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో చేరినందువల్ల కెరీర్ సంబంధమైన విషయాలన్నీ సానుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
లాభస్థానంలో గురు బలం బాగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల కంటే ఒక అడుగు ముందుంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రతి ప్రయత్నమూ సానుకూలపడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
సప్తమ స్థానంలో శుక్ర, కుజుల సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి సానుకూలపడుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి కాస్తంత అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఒక శుభ కార్యంలో బంధువులకు సహాయంగా ఉంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
పంచమ స్థానంలోని కుజ, శుక్రుల కారణంగా ఇంటా బయటా కొన్ని అనుకూలతలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలకు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడ తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలి తాలందుకుంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశికి దాదాపు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్లలో మనసులోని ప్రధాన కోరికలు నెర వేరుతాయి. ఉద్యోగ ఆర్థిక స్థిరత్వాలకు సమస్య ఉండదు. అనారోగ్యాల నుంచి చాలావరకు బయట పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోయి, సామరస్యం ఏర్పడుతుంది. శని అనుగ్రహం పూర్తిగా ఉన్నందువల్ల ఆదాయపరంగా, ఉద్యోగపరంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. నాలుగవ స్థానంలో శని, బుధ, రవులు కలవడం వల్ల, ఒకటి రెండు కుటుంబ సమస్యలకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఈ రాశివారికి దాదాపు ప్రతి గ్రహమూ అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని విషయాల్లోనూ సమ యం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగంలో వేగంగా పురోగతి ఉంటుంది. వ్యాపా రాలు కూడా లాభాల బాటలో ముందుకు వెడతాయి. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు ఫలి స్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి మంచి ఊరట లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయ వద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ముఖ్యంగా సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశిలో సంచారం చేస్తున్న శని, రవి, బుధుల వల్ల వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొందరు బంధువులకు సహాయంగా నిలబడతారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
లాభ స్థానంలో ఉన్న కుజ, శుక్రుల వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో మీ విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుంటాయి.