Horoscope Today: వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం చేతికి అందుతుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

| Edited By: Ram Naramaneni

Dec 21, 2023 | 10:29 AM

దిన ఫలాలు (డిసెంబర్ 21, 2023): మేష రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం చేతికి అందుతుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 21st December 2023
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 21, 2023): మేష రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో, పోటీ పరీక్షల్లో దూసుకుపోతారు. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం చేతికి అందే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగ స్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. గృహం కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. ప్రయత్నాలలో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి నిపుణులకు అవకాశాలు కలిసి వస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమా జంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ముందుకు సాగుతాయి. కొందరు సహచరుల వల్ల డబ్బు నష్టం జరగవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం చేయవద్దు. ఖర్చులు బాగా పెరుగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ, చివరికి సంతృప్తికరంగా వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగుల మీద అదనపు బాధ్యతలు పడినప్పటికీ, వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. బంధు వులతో ఏర్పడిన వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు బహు మతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విష యాల్లో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పిల్లల వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యో గంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధి స్తారు. రుణ సమస్యలు తగ్గి ఊరట చెందుతారు. కుటుంబంలో దైవ కార్యం తలపెడతారు. పిల్లల్లో ఒకరికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. తప్పకుండా ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. దైవ చింతన పెరుగుతుంది. ఆస్తి వివాదాలలో తొందరపడి వ్యవహరించడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్ప డుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. సోదర వర్గంతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. ప్రయాణ విషయాల్లో తొందరపాటు పనికి రాదు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రులతో మాటపట్టింపులు, అపార్థాలు తొలగిపోతాయి. వ్యక్తిగత పనులు, కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవు తాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలుండవచ్చు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆస్తిపాస్తుల పరంగా ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. పిల్లల చదువులు, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. చేప ట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమ స్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. నిరు ద్యోగులకు ఆశించిన కంపెనీ నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.