Horoscope Today (20-10-2022): చాలామంది రోజు మొదలైందంటే చాలు .. ముందుగా ఆలోచించేది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 20 వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆవేశంలో నిర్ణయాలను తీసుకోకండి.. మానసిక ధైర్యంతో చేసే పనితో కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నమ్మకంతో పనిచేస్తే విజయం లభిస్తుంది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ప్రోత్సాహకరమైన వాతావరణంతో పనిచేస్తారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అధిక ధన వ్యయం చేస్తారు. అతిగా నమ్మడం మంచికాదు. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కీలక వ్యవహారంలో దైర్యంగా ముందుకు అడుగు వేసి.. అందరి ప్రశంసలను అందుకుంటారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేసి.. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు అనవసర ఆందోళనకు దూరంగా ఉండడం మేలు. మధ్యమ ఫలితాలను అందుకుంటారు. సమస్యలకు కుంగిపోకుండా ఉండడం నలుగురిని కలుపుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్తారు. కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు మధ్యమ ఫలితాలను అందుకుంటారు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మేలు. మానసిక ప్రశాంత కోసం దైవ దర్శనం మేలు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక ధనలాభం పొందుతారు. బంధు. మిత్రుల సహకారంతో ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలను అందుకుంటారు. శత్రువు మీద విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనుల విషయంలో ఆర్ధిక పురోగతి ఉంటుంది. అనవరస వివాదాలకు దూరంగా ఉండండి. అనుకున్న పని నెరవేరుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం