Horoscope Today: ఉద్యోగంలో వారికి ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఇలా..

| Edited By: Janardhan Veluru

Dec 11, 2023 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 11, 2023): మేష రాశి వారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. సమాజంలోని ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి. మిథున రాశి వారికి రోజంగా హ్యాపీగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఉద్యోగంలో వారికి ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఇలా..
Horoscope Today 11th December 2023
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 11, 2023): మేష రాశి వారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. సమాజంలోని ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి. మిథున రాశి వారికి రోజంగా హ్యాపీగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. కుటుంబ పెద్దల ద్వారా ప్రయోజనం పొందు తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. సమాజంలోని ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంగా హ్యాపీగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఇతరులకు సహాయపడగల స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఆదరాభిమా నాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అష్టమ శని, దశమ గురువు కారణంగా వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఆటుపోట్లు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధపెట్టడం అవసరం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎవరికీ హామీలు ఉండడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదు.

సింహం (మఖ, పుబ్బ, హస్త 1)

భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల ఎటువంటి చీకూ చింతా ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవ కాశం ఉంది. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మితిమీరిన ఔదార్యం వల్ల దెబ్బతింటారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడ తాయి. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక, ఆర్థికంగా కూడా ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభి స్తుంది. అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవు తాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. విలాసాల మీద ఖర్చు ఎక్కువవు తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశ్యధిపతి కుజుడు రాశిలోనే ఉన్నందువల్ల విజయాల సంఖ్య కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాల వల్ల లాభం ఉంటుంది. మిత్రులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. స్థిరాస్తి వివాదం నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, హ్యాపీగా సాగిపో తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు, ధనాధిపతి శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. ఆదాయంలో ఎప్పటికప్పుడు ఆశించినంత పెరుగుదల ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి డిమాండ్, సంపాదన పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశ్యధిపతి శనీశ్వరుడు ద్వితీయంలో బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. బంధువులకు సహాయం చేసి ఇబ్బందిపడతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

దశమ స్థానం బలంగా ఉన్న కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధి కారులతో సామరస్యం పెరుగుతుంది. అయితే, ఏలిన్నాటి శని కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, ఆర్థిక ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదనకు లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు.