Horoscope Today: ఈ రాశివారు నేడు ఆకస్మిక ధనలాభం పొందుతారు.. ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Sep 11, 2022 | 6:33 AM

మ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 11వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈ రాశివారు నేడు ఆకస్మిక ధనలాభం పొందుతారు.. ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us on

Horoscope Today (11-09-2022): కొత్తగా రోజు మొదలైతే.. ముందుగా ఎక్కువమంది ఆలోచించేది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి జరుగుతుందా.. ఏమైనా చెడు జరిగే అవకాశం ఉందా అని ఆలోచిస్తారు.  వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 11వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. కొత్తగా ప్రారంభించనున్న పనుల విషయంలో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  కుటుంబ సభ్యులతో కలిసి పనులు చేస్తే శుభఫలితాలను అందుకుంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా ధృడంగా ఉంటారు. కీలక విషయాల్లో శుభపరిమాణాలు చోటు చేసుకుంటాయి. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ధన వ్యయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు మొహమాటం వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. కీలకమైన పనులు ప్రారంభిస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర ధన వ్యయం చేస్తారు. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీస్సులను పొందడం మేలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధువుల సహాయ సహకారాలను పొందుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రశాంతమైన మనసుతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శారీరక శ్రమ అధికంగా చేయాల్సి ఉంటుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మానసికంగా బలంగా ఉండాలి. కొందరి ప్రవర్తన ఈ రాశివారికి బాధిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి డబ్బులను అందుకుంటారు. ఇతరులతో సంతోషంగా గడుపుతారు. కాలానికి అనుగుణంగా కీలక విషయాల్లో పెద్దలను కలిసి ముందుకు అడుగు వేస్తారు. శరీర సౌఖ్యం లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు సాగుతారు. శారీరకంగా శ్రమ పెరుగుతుంది. బంధు,మిత్రులతో విబేధాలు కలగవచ్చు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రారంభించనున్న పనుల్లో విజయం సొంతం చేసుకునే విధంగా నిర్ణయాలను తీసుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)