Horoscope Today: వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దినఫలాలు (అక్టోబర్ 10, 2023): మేష రాశి వారికి రోజంతా చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మిథున రాశి వారికి కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 10th October 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 10, 2023 | 5:05 AM

దినఫలాలు (అక్టోబర్ 10, 2023): మేష రాశి వారికి రోజంతా చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మిథున రాశి వారికి కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా చాలావరకు మీకు అనుకూలంగా సాగిపోతుంది. సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలకు ఇది మంచి కాలం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ముఖ్యమైన పనులు, వ్యవహారా లన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుని సరదాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సంసార జీవితం సాఫీగా గడిచిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనవసర ఖర్చులను తగ్గించు కోవడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకు ఇబ్బందేమీ ఉండదు. అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ సంబంధం కుదురుతుంది. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశం ఉంది. పిల్లల నుంచి సమస్యలు ఎదురు కావచ్చు. సతీమణి కూడా ఉద్యోగపరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయానికి, ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరడమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాను కూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సతీ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పరవా లేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలు, వివాదాలు చాలావరకు పరిష్కరించుకుం టారు. ఆదాయ పరిస్థితి ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉండనప్పటికీ, రోజంగా హుందాగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో మీ శ్రమ, ప్రతిభ మరింతగా అవసరమవుతాయి. అధి మకారులు బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశ పెట్టి, లాభాలు పెంచుకుంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. పిల్లల నుంచి, సతీమణి నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టమైన వ్యక్తులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. అను కోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో వ్యయ ప్రయాసలుంటాయి. స్నేహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఆదాయ మార్గాలు అనుకూ లంగా ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సతీమణికి మంచి పురోగతి ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అత్యవసర వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలు చేపట్ట డానికి ఇది చాలా అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవు తుంది. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దైవ కార్యాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొద్ది ఖర్చుతో ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరిస్థితుల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగపరంగానే కాక, కుటుంబపరంగా కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, వ్యయ ప్రయాసల కారణంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని తలోదారికి లాగుతున్నట్టు కనిపిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇంటా బయటా అను కూల పరిస్థితులుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సతీమణికి ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు పెడతారు. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది.

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!