AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు..12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope in Telugu (April 8, 2026): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృథా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశి వారికి ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు..12 రాశుల వారికి రాశిఫలాలు
Rashifal In Telugu 08 April 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 08, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఏప్రిల్ 8, 2026): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభించే అవకాశముంది.  మిథున రాశి వారికి ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో సహోద్యోగుల బాధ్యతల్ని కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృథా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి శ్రమ, ఒత్తిడి ఉంటాయి. పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటుతనంతో వ్యవహరించే అవకాశం ఉంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధిఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో బాగా అనుకూలత ఏర్పడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు సంబంధించిన బాధ్యతలను మీరు నిర్వర్తించవలసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కొద్దిగా శ్రమ, తిప్పట తప్పక పోవచ్చు. కొందరు బంధుమిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్యం మీద శ్రద్ద అవసరం. కొన్ని పనుల్ని పూర్తి చేయడంలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టుగా రాబడి ఉంటుంది. ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. కొందరు చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రానికి వెడతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు బంధువులను ఆదుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులకు ఆర్థిక‍ సహాయం చేయాల్సి వస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

థనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. బంధుమిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. సమాజంలో పలుకుబడి విస్తరిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబసమేతంగా శుభ కార్యంలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో ఆదరణ, ప్రోత్సాహాలు పెరుగుతాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయట పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది. పట్టుదలగా అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

Follow Us