Horoscope Today: ఈ రాశివారికి ఆదాయం, ఆరోగ్యానికి లోతుండదు.. మరి మీ రాశి ఎలా ఉందంటే

| Edited By: Ravi Kiran

Dec 06, 2024 | 5:00 AM

ఆదాయానికి, ఆరోగ్యానికి, ఆదరణకి లోటుండదు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది.

Horoscope Today: ఈ రాశివారికి ఆదాయం, ఆరోగ్యానికి లోతుండదు.. మరి మీ రాశి ఎలా ఉందంటే
Horoscope Today
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. నిరుద్యోగులు అను కోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని సమస్యలు, వివాదాల నుంచి అనుకోకుండా బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆదరణకు లోటుండదు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బాగా పురోగమిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారులకు నమ్మకం బాగా పెరిగి ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. పిల్లల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ తెలివితేటలు, అనుభవం బాగా రాణిస్తాయి. లాభాలు నికరంగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు విజయవంతం అవుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ది చెందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయ వ్యయాలు సమానంగా సాగిపోతాయి. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ కపోవడం మంచిది. రావలసిన సొమ్మును వసూలు చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సౌఖ్యం కాస్తంత తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయానికి, ఆరోగ్యానికి, ఆదరణకి లోటుండదు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం అన్ని వైపుల నుంచి వృద్ధి చెందుతుంది. అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్దిస్తుంది. ప్రమాణాల వల్ల లాభముంటుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో గౌరవ మర్యాదలకు లోటుండదు కానీ, పని భారం మాత్రం పెరుగుతుంది. ఉద్యోగం మారాలన్న కోరిక ఇప్పట్లో తీరే అవకాశం లేదు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబపరంగా సమస్యలుండే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామితో అపార్థాలు తలెత్తుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, వృథా వ్యయా లతో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

శుభవార్తలు ఎక్కువగా వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. తల్లితండ్రుల ద్వారా కూడా ఆర్థిక లాభాలు కలుగు తాయి. కొద్దిపాటి అనారోగ్యాలకు అవకాశముంది. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలను అమలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాలు సమసిపోతాయి. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేసినా ఫలితం ఉంటుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు నిలకడగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బాధ్యతల భారం కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంటా బయటా శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. మీ సమర్థ తకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమ వుతుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మిత్రుల మీద వృథా ఖర్చుల్ని తగ్గించుకో వడం మంచిది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. పెళ్లి ప్రయత్నం సఫల మవు తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం విలాసాల మీద ఖర్చుపెట్టే అవకాశం ఉంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయపరంగా బాగా వృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది ప్రయత్నంతో కొన్ని సమ స్యల నుంచి బయటపడడం జరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం నిలకడగా ఉంటుంది. రావలసిన డబ్బు సమయానికి తప్పకుండా అందుతుంది. ఆరో గ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆదాయ వృద్దికి ఎంత కృషి చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ సమర్థతను అధికారులు బాగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఏలిన్నాటి శని కారణంగా స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. దైవ కార్యాల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల నష్టం కలగడమో, వృథా కావడమో జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరు గుతుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫల మయ్యే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..