Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం దినదినాభివృద్ది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

| Edited By: Rajeev Rayala

Dec 05, 2024 | 6:33 AM

Today Horoscope (December 5, 2024): మేష రాశి వారు ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం దినదినాభివృద్ది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 05th December 2024
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 5, 2024): మేష రాశి వారు ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

దశమ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించినందు వల్ల ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ధన స్థానాధిపతిగా శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నందువల్ల ధనాదాయం సంతృప్తికరంగా పెరిగే అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నమైనా శుభ ఫలితాలనిస్తుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యో గులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. తండ్రితో సానుకూలతలు ఏర్పడతాయి. పిత్రార్జియం అందే అవకాశం ఉంది. కుటుం బంలో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఇబ్బడిముబ్బడిగా లాభాలనిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడితో సహా శుభ గ్రహాలేవీ అనుకూలంగా లేకపోవడం వల్ల ఆదాయ వృద్ధి మీద ఆశలు పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. షష్ట స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినం దువల్ల ఉద్యోగంలో మీ సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది. అధికారులకు మీ ప్రతిభ ఎంతో ఉప యోగపడుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గురు, బుధులు బాగా అనుకూలంగా ఉండడంతో పాటు, సప్తమ స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల ఏలిన్నాటి శని దోషాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ సునాయా సంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ స్థానంలో వక్ర గురువు సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో ఎంతగా కష్టపడ్డా అధికారులు సంతృప్తి చెందరు. ఇతర ఉద్యోగులతో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి విషయంలోనూ పని భారం ఎక్కువగా ఉంటుంది. తరచూ శివార్చన చేయించడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని ప్రభావం తగ్గిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపో తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు పంచమంలోనూ, గురువు భాగ్య స్థానంలోనూ ఉన్నందు వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మీ సమర్థతకు, ప్రతిభకు తిరుగులేని గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవు తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడికి చతుర్థ స్థానంలో దిగ్బలం పట్టినందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడం వల్ల ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. కుటుంబంలో సరదాలు, సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆస్తిపాస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సప్తమ స్థానంలో గురువు సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం దినదినాభి వృద్ది చెందుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో తప్పకుండా పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా అనుకూల ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో మాత్రం అదనపు బాధ్యతల కారణంగా పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కూడా మందకొడిగా సాగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రాశికి ధన స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం, శని తృతీయంలో ఉండడం వల్ల ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. మాటకు విలువ ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల మీరు పని చేసే సంస్థకు మేలు కలుగుతుంది. విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఇదే రాశిలో సంచారం ప్రారంభించినందువల్ల ఉద్యోగంలో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశీ అవ కాశాలు కూడా అందుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి పదోన్నతి దక్కే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవ కాశం ఉంది. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. పిల్లలు బాగా వృద్దిలోకి వస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ప్రస్తుతం ధన స్థానంలో రాహువు అనుకూలంగా ఉండడంతో పాటు, దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఏలిన్నాటి దోషం చాలావరకు తగ్గిపోతుంది. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. పని భారం బాగా తగ్గుతుంది. ఏదో విధంగా ఆదాయం కొద్ది కొద్దిగా పెరు గుతూ ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు, భాగ్య స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా శుభ ఫలితాలనిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.