Horoscope Today: ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

|

Oct 03, 2021 | 6:49 AM

Horoscope Today (October 03-10-2021):  ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ..

Horoscope Today: ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Horoscope Today
Follow us on

Horoscope Today (October 03-10-2021):  ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 3న ) ఆది వారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు బంధువులను కలుస్తారు. ఆర్ధికంగా సాయం అందుకుంటారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. అనుకున్న పనులను నెరవేర్చుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభ రాశి: ఈ రాశివారు ఈరోజు ఆనారోగ్యానికి గురవుతారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి . వృత్తి, వ్యాపారాల్లో ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దైవ దర్శనం చేసుకుంటారు.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు ధనాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. కొత్త వస్తు, వాహన, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈరాశివారికి మానసిక ఆందోళకు గురవుతారు. శారీరక ఇబ్బందులు పడతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్త్రీల వలన శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.  కొత్తగా పనులు వాయిదా వేసుకోవడం మంచింది.

తులా రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. బంధు మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలను చేపడతారు. శుభవార్తలు వింటారు. మానసికంగా ఆనందంగా ఉంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్త్రీల వలన లాభాలు ఉంటాయి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు  నెరవేరతాయి.  అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. రాజకీయరంగంలోనివారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకోని ఆపదల్లో చిక్కుకుంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి చెందుతారు.  ఆకస్మికంగా ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు వాయిదా పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంతో సంతోషముగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మికంగా ధన ఏర్పడుతుంది. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.

Also Read:

తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్న రజనీకాంత్‌ కూతురు… అధికారికంగా ప్రకటించిన లైకా ప్రొడక్షన్‌..