Holi 2025 Zodiac Colours: రంగుల కేళీ హోలీ రోజున రాశి ప్రకారం ఏ రంగుతో హోలీ ఆడడం శుభప్రదం అంటే..

హోలీ అంటే రంగుల పండుగ. రంగుల కేళీ.. హోలీ రోజున ఉపయోగించే ప్రతి రంగుకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రంలో ఎవరైనా తమ రాశి ప్రకారం రంగులను ఉపయోగిస్తే.. అతని జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని, ఆనందం పెరుగుతుందని నమ్మకం. కనుక ఈ హోలీకి ఏ రాశి వారు ఏ రంగులతో హోలీ ఆడాలో తెలుసుకుందాం.

Holi 2025 Zodiac Colours: రంగుల కేళీ హోలీ రోజున రాశి ప్రకారం ఏ రంగుతో హోలీ ఆడడం శుభప్రదం అంటే..
Holi 2025 Vastu Tips

Updated on: Mar 08, 2025 | 10:35 AM

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ మార్చి 14న జారుపుకోనున్నారు. హోలీ రోజున రంగుల సందడి నెలకొంటుంది. రంగులు ప్రతిచోటా నేలమీద ఇంద్రధనస్సు ఉన్నట్లు కనిపిస్తుంది. హోలీ పండుగ శత్రువులను కూడా స్నేహితులుగా మార్చే పండుగ అని అంటారు. ఈ రోజున పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా రంగులు పూసుకుని ఒకరినొకరు కౌగిలించుకుని సంతోషంగా పండగను జరుపుకుంటారు. ఈ రోజు జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ రాశి వారు ఏ రంగులను ఉపయోగించాలో తెలుసుకుందాం..

హోలీ పండుగ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. అలాగే ఈ రోజున మీ రాశి ప్రకారం రంగులు ఉపయోగిస్తే మీకు శుభ ఫలితాలు, ఆనందం లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈసారి హోలీ రోజున మేష రాశి నుంచి మీన రాశి వరకు అన్ని రాశుల వారు ఏ రంగులను ఉపయోగించాలంటే

మేషం, వృషభ రాశుల వారు

మేషం, వృశ్చిక రాశుల వ్యక్తులు ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు. ఈ రెండు రాశుల అధిపతిని భూమి కుమారుడైన కుజుడుగా పరిగణిస్తారు. అంగారక గ్రహానికి ఇష్టమైన రంగు ఎరుపు. అటువంటి పరిస్థితిలో, మేషం, వృశ్చిక రాశి వారు ఈ హోలీకి ఎరుపు రంగును ఉపయోగించాలి. అలాగే నారింజ, మెరూన్ రంగులతో హోలీ ఆడవచ్చు. ఈ రంగులతో హోలీ ఆడటం ద్వారా మేషం, వృశ్చిక రాశుల వారు శుభ ఫలితాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

వృషభం, తుల రాశుల వారు

వృషభ, తుల రాశుల రెండింటికీ అధిపతి శుక్రుడు. అటువంటి పరిస్థితిలో ఈ హోలీ పండుగను వృషభ, తుల రాశి వారు హోలీ ఆడటానికి లేత నీలం, బూడిద, గులాబీ రంగులను ఉపయోగించాలి. ఈ రంగు వృషభ , తుల రాశుల వారికి శుభప్రదం. హోలీలో ఈ రంగులను ఉపయోగించడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడతాడు.

మిథున, కన్య రాశులు

బుధుడు మిథున, కన్య రాశుల రెండింటికీ అధిపతి. ఈ హోలీకి మిథున, కన్య రాశుల వారు ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగులతో హోలీ ఆడవచ్చు. మిథున, కన్య రాశి వారు ఈ రంగులతో హోలీ ఆడటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

కర్కాటక రాశి

కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ హోలీకి కర్కాటక రాశి వారు వెండి లేదా లేత గులాబీ రంగును ఉపయోగించాలి. ఈ రంగులతో హోలీ ఆడటం వల్ల చంద్రుడు బలపడతాడు. జీవితంలో సానుకూలత వస్తుంది.

సింహ రాశి

సింహ రాశికి సూర్యుడు అధిపతి. సింహ రాశి వారు నారింజ , ముదురు పసుపు రంగులతో హోలీ ఆడవచ్చు. ఈ రంగులను ఉపయోగించడం ద్వారా సూర్యుడు సంతోషించి మనలను ఆశీర్వదిస్తాడు. ఇది జీవితంలోని సమస్యలను తొలగిస్తుంది.

ధనుస్సు, మీన రాశి రాశులు

బృహస్పతి ధనుస్సు , మీన రాశులకు యజమాని. ధనుస్సు.. మీన రాశి వారు హోలీ రోజున పసుపు, నారింజ, సముద్ర నీలం రంగులను ఉపయోగించాలి. ఈ రంగులను ఉపయోగించడం ద్వారా గురువు సంతోషపడతాడు.

మకర, కుంభ రాశులు

మకరం, కుంభ రాశులు శనీశ్వరుడి సొంత రాశులు. మకర రాశి వారు హోలీని గోధుమ, బూడిద, ముదురు నీలం రంగులతో ఆడాలి. కుంభ రాశి వారు హోలీ రోజున నీలం, గోధుమ రంగులను ఉపయోగించాలి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు